ఇటీవల ఏపీ మంత్రి లోకేష్ బనకచర్లపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ బనకచర్ల కోసం వరద నీరు తీసుకుపోతే ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారని అంటున్నారు.. లోకేష్ ముందు నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు గురించి తెలుసుకోండి.. తెలంగాణకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటి లభ్యత దృశ్య 968 టిఎంసి లు తెలంగాణ కు, 531 టీఎంసీ లు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన తరువాత ఆ నికర జలాల మీద మిగులు జలాలు తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలని అన్నారు.
వరద జలాల లభ్యత పైన ప్రాజెక్టులు నీటి వినియోగం పూర్తి అయిన తరువాత వరద జలాలు లెక్కలోకి వస్తాయి. అది తెలియకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కులు ఆనాడు ట్రిబ్యునల్ లు కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయించిన విధంగా మా నీటిని ఒక చుక్క కూడా వదులుకోమని స్పష్టం చేశారు. నీటికి సంబంధించిన అంశాల పై ఇరు రాష్ట్రాలు గర్షన వాతావరణం తెచ్చుకునే పరిస్థితి మంచిది కాదన్నారు.
Also Read:Coolie : రజనీకాంత్ ‘కూలీ’ లో కమల్ హసన్..
మా కోటా మా వాట మా నీటి వినియోగం పూర్తికాకముందే మీరు వరద జలాల పేరు మీద ప్రాంతీయ అసమానతలు రెచ్చగొడుతున్నారని.. వాట తేవడానికి మా రాష్ట్ర ప్రయోజనాలు మా రైతుల హక్కుల కోసం బాజప్త మాట్లాడతాం.. మా రాష్ట్ర హక్కులు మేము కాపాడుకుంటాం.. మీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోండి కానీ ప్రజలను మోసం చేసే విధంగా తప్పుడు సమాచారం ఇవ్వవద్దు అని సూచించారు.
