కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చెప్పినట్టు.. జనాభా ప్రాతిపదికన అవకాశాలు ఇచ్చేందుకు చూస్తున్నామని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాహుల్ గాంధీ మాటకు అనుగుణంగా బీసీ కుల జన గణన చేస్తున్నామన్నారు. శాసన సభ సమావేశాల్లో ఈ బిల్లు పెడుతామని చెప్పుకొచ్చారు. బీసీలు అందరు గర్వంగా ఫీల్ కావాల్సిన సందర్భం ఇది.. బలహిన వర్గాల పార్టీ కాంగ్రెస్ అని ఆయన చెప్పుకొచ్చారు. రిటైర్డ్ జడ్జి, ఉద్యోగులు, బీసీ సంఘాల నేతల సలహాలు తీసుకుంటాం అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Read Also: Vishwambhara : మెగాస్టార్ మూవీలో విలన్ గా నటించబోతున్న ఆ కోలీవుడ్ స్టార్ హీరో..?
ఇక, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత పదేళ్ల నుంచి మహత్మ జ్యోతిరావు పూలే విగ్రహం గురించి ఎందుకు మాట్లాడలేదు అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. రాజకీయం చేయాలని అనుకుంటే బయట చేయాలి.. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో అధ్యక్ష పదవి, వర్కింగ్ ప్రెసిడెంట్, శాసన సభ పక్ష నేత పదవిని బీసీలకు ఇచ్చి తమ చిత్తశుద్ధి నిరూపించండి అన్నారు. బీఆర్ఎస్ నేతలు నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. లిక్కర్ బిజినెస్ బిజీ నుంచి తగ్గినట్టు ఉంది.. ఇప్పుడు జ్యోతిరావు పూలే గురించి మట్లాడుతున్నారు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
