NTV Telugu Site icon

Ponnam Prabhakar: రెవెన్యూ పెంచేందుకు మార్గాలు అన్వేషించాలి.. అధికారులకు సూచన

Ponnama Prabhakar

Ponnama Prabhakar

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారులు, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లు, ఆర్టీవోలు తదితర అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా చట్టానికి లోబడి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం చేశారు. త్రైమాసిక టాక్స్ వసూలుకు సంబంధించి తక్కువగా నమోదు చేసిన వివిధ జిల్లాల అధికారులకు తమ పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. 100 శాతం పన్ను వసూలు చేసిన జిల్లా అధికారులను అభినందించారు. సమావేశానికి రాని అధికారులపై నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ మంత్రిగా మొదటిసారి డిటిసిలో సమావేశాన్ని ఏర్పాటు చేశామని అధికారులు హుందాగా వ్యవహరిస్తూ, రవాణా శాఖ గౌరవాన్ని పెంపొందించాలని పేర్కొన్నారు. ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న రవాణా శాఖ కార్యాలయాలకు కావల్సిన సొంత భవనాల కోసం ల్యాండ్ సెర్చ్ చేయాలని ముఖ్యమంత్రితో చర్చించి సొంత భవనాల సమస్య పరిష్కారించుకుంటామని హామీ ఇచ్చారు. అధికారులు రెవెన్యూ పెంచేందుకు మార్గాలు అన్వేషించాలని సూచించారు. ఆదాయ అన్వేషణలో విచక్షణ రహితంగా వేధింపుల వల్ల కాకుండా చట్ట ప్రకారమే వ్యవహరించాలని సూచించారు. జిల్లాల్లో విధిగా వాహనాలు తనిఖీ చేయాలని ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేయాలని సూచించారు.

Amritpal Singh: ఖలిస్తానీ అమృ‌త్‌పాల్ సింగ్‌ని జైలు నుంచి విడుదల చేయాలి.. కమలా హారిస్‌ని కోరిన సిక్కు లాయర్..

అధికారులు ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రస్తుతం ఉన్న రవాణా శాఖకు సంబంధించిన వాహనాలను ఒకే గూటికి తీసుకొచ్చే విధంగా స్టిక్కరింగ్ ఉండేలా చూసుకోవాలన్నారు. రోడ్డు భద్రత పై రవాణా శాఖ అన్ని స్కూల్స్, కాలేజీల్లో రోడ్డు సేఫ్టీ అవగాహన కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలని సూచించారు. ప్రతి స్కూల్ బస్సును తనిఖీ చేయాలని డ్రైవర్లకు, స్కూల్ బస్సులకు కచ్చితంగా ఫిట్నెస్ ఉంటేనే రోడ్డు ఎక్కేలా చూడాలని అధికారులకు సూచించారు. రోడ్డు భద్రత పై రవాణా శాఖ అధికారులు జిల్లాలో కలెక్టర్ ప్రాభవిక వ్యక్తులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. వారం రోజుల పాటు స్కూల్ లు, కాలేజీల్లో ఈ కార్యక్రమాలు చేయాలని తెలిపారు. ప్రతి విద్యార్థికి రోడ్డు భద్రత పై కనీస అవగాహన ఉండేలా చూసుకోవాలన్నారు.

Delhi: దేశ రాజధానిని వేధిస్తోన్న విద్యుత్ సంక్షోభం.. ప్రజలు తీవ్ర ఇక్కట్లు

స్కూల్ బస్సుకి సంబంధించి డ్రైవర్, క్లీనర్ బస్సు సమయాలు తెలిపే విధంగా.. ప్రతి పాఠశాల యాజమాన్యం స్కూల్ బస్ యాప్ లో అప్డేట్ చేస్తే పూర్తి సమాచారం తల్లిదండ్రులకు తెలిసేలా ప్రమాదాలు నివారించేందుకు ఆస్కారం ఉంటుందని పలువురు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దాంతో పాటు గతంలో కారు డోర్ లకు బ్లాక్ ఫిలిం గ్లాస్ ఉన్న వాటిపై విధిగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద ఉన్న చెక్ పోస్టులను ఎన్ఫోర్స్ మెంట్ను మరింత బలపరిస్తే అవినీతికి ఆస్కారం లేకుండా ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించారు. సీజ్ అయిన వాహనాలకు సంబంధించి పాలసీలో ఉన్న విధంగా వ్యవహరించాలని వాహనాలను భద్రపరిచే ప్రదేశలపై జిల్లా పోలీస్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవాలన్నారు. హైదరాబాదు ఆటో రిక్షాలపై ప్రస్తుతం ఉన్న పాలసీతో పాటు సిఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేలా రూపొందించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ విషయంలో అవినీతికి ఆస్కారం లేకుండా డిసెంట్రలైజ్ ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనం చేయాలని సూచించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని ఏదైనా భిన్న ఆలోచన వస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు.