NTV Telugu Site icon

Ponnam Prabhakar: ఆటో కార్మికుల పైన బిఆర్ఎస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికుల పైన మొసలి కన్నీరు కారుస్తోందని మండిపడ్డారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండని ఆయన విమర్శించారు. మెట్రో వస్తే ఇతర వాటిపై ప్రభావం పడిందని, మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తే, ఆటో సర్వీసులకు ప్రభావం పడుతుందని చెప్పడం తప్పని ఆయన అన్నారు. బస్సులు ప్రజల ఇంటి దగ్గరికి వెళ్ళకుండా, బస్సు స్టాండ్ నుండి వెళ్ళడం మాత్రమే జరుగుతోందని, ప్రజలు ఇంటి దగ్గర నుండి బస్సు స్టాండ్ వరకు వెళ్ళేందుకు ఆటో సేవలను ఉపయోగించుకుంటున్నారని వివరణ ఇచ్చారు.

Also Read: Telangana Assembly: హాట్ హాట్గా కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ అప్డేట్స్

ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు 12 వేల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చే హామీ ఇచ్చినప్పటికీ, ఈ సంవత్సరం ఆర్థిక సంక్షోభం కారణంగా ఆ మొత్తాన్ని ఇవ్వలేకపోయామని మంత్రి చెప్పారు. అయితే భవిష్యత్తులో ఆటో కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం కాపాడడంపై అవగాహన కల్పించమని అన్నారు. ఆటో కార్మికులు వేసుకునే డ్రెస్ లు వేసుకోవడం, బేడీలు వేసుకొని వేషాలు వేయడం రాజకీయ డ్రామా అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజకీయాలకు సంబంధించి నిరసనలు చేయడం అవసరం లేదు. మీరు నిజంగా చిత్తశుద్ధితో ఉన్నా, ఎప్పుడైనా రవాణా శాఖ మంత్రికి ఆటో కార్మికుల సమస్యలపై రీప్రజెంటేషన్ చేసారా అని ప్రశ్నించారు.

Show comments