NTV Telugu Site icon

Ponnam Prabhakar: కేటీఆర్ ఓటమిని జీర్ణించుకోలేక స్వేదపత్రం పేరిట తప్పుడు లెక్కలు

Ponnam

Ponnam

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన వచ్చింది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నాగ్ పూర్ లో కాంగ్రెస్ ఆవిర్భావ సభకు భారీగా తరలి రావాలి అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ 139 ఏళ్ల వేడుకలు పండగ రోజులా జరగనున్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శాసన సభలో ప్రవేశ పెట్టాం.. 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో తెలంగాణను నెట్టేశారు.. కేటీఆర్ ఓటమిని జీర్ణించుకోలేక స్వేద పత్రం పేరిట తప్పుడు లెక్కలు చెప్పారు.. స్వేద పత్రం కాదు, ప్రజల చెమటతో స్వేద సోధ భవనాలు నిర్మించారు.. బిఆర్ఎస్ నేతల ఆర్థిక పరిస్థితి స్వేద పత్రం విడుదల చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.

Read Also: Venkatesh 75: 75 సినిమాల వెంకీ మామ.. సర్ప్రైజ్ ఈవెంట్

ఈ సంద‌ర్బంగా ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఆర్టీసీకి 2 వేల కొత్త బ‌స్సులు రాబోతున్నాయని చెప్పారు. ఎవరైనా ఆర్టీసీకి సంబంధించిన స్థలాలపై క‌న్నేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. గ‌తంలో ఆర్టీసీ స్థలాలకు సంబంధించిన భూముల లీజుల‌ను పునః స‌మీక్షిస్తామ‌ని పేర్కొన్నారు. లీజుల కేటాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు విచారణలో తేలితే వాటిని స్వాధీనం చేసుకుంటామని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ఆర్టీసీకి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి.. ప్రస్తుతం ప్రజలకు సేవలు అందించడంలో దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ ఆర్టీసీ ఉంది.. త‌మ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌లో రెండింటిని అమ‌లు చేస్తున్నాం.. మిగ‌తా నాలుగు గ్యారెంటీల‌ను అమ‌లు చేసి తీరుతామ‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.