Site icon NTV Telugu

Permanent House: పేదల ఇళ్లకు శాశ్వ‌త పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Ministernarayana

Ministernarayana

40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్యను మంత్రి నారాయణ పరిష్కరించారు. నెల్లూరు సిటీలో 1400 మంది పేదల ఇళ్లకు శాశ్వ‌త పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో పెన్నా నదీ తీరాన ఉన్న నివాసాలన్నంటికీ శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. భగత్ సింగ్ కాలనీ వాసులకు ఈరోజు ఒక పండుగ రోజు అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేద‌ల ప‌క్షాన ఉంటుంద‌నే దానికి ఇదే నిద‌ర్శ‌నం అని అన్నారు.

Also Read: CM Revanth Reddy: ఉగ్రవాదులను ఏరివేయండి.. మా మద్దతు ఉంటుంది..!

‘భగత్ సింగ్ కాలనీ వాసులకు ఈరోజు ఒక పండుగ రోజు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇళ్ల‌ పట్టాలు ఇవ్వకుండా కాలక్షేపం చేశారు. గ‌త ప్ర‌భుత్వం దొంగ ప‌ట్టాలు ఇచ్చి పేద‌ల‌ను మోసం చేసింది. సీఎం చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణ‌యం 1400 మంది పేద కుటుంబాల‌కు మంచి వ‌రం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేద‌ల ప‌క్షాన ఉంటుంద‌నే దానికి ఇదే నిద‌ర్శ‌నం’ అని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.

Exit mobile version