NTV Telugu Site icon

Minister Viswaroop:ఏపీలో ముందస్తు ఎన్నికలు..? మరోసారి క్లారిటీ ఇచ్చిన మంత్రి

Viswaroop

Viswaroop

Minister Viswaroop: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి.. ఎప్పుడైనా.. ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చు అంటూ ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి.. ముందస్తు రావొచ్చు.. కానీ, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమని ఇప్పటికే పలు సందర్భాల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు.. జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్ కూడా ప్రకటించారు.. అయితే, అధికార పార్టీ వాదన మరోలా ఉంది.. తాము ముందస్తుకు వెళ్లేది లేదని.. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని మంత్రులు, వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు.. ఇక, మంత్రి వర్గ సమావేశంలోనూ సీఎం వైఎస్‌ జగన్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.. కానీ, ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ఈ నేపథ్యంలో మరోసారి ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు మంత్రి విశ్వరూప్‌.

Read Also: Nabha Natesh : కిల్లింగ్ పోజులతో రెచ్చగొడుతున్న నభా నటేష్ ..

ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు మంత్రి విశ్వరూప్‌.. ప్రజలు తమకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారని ఐదేళ్లు పరిపాలన చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. యథావిథిగా ఏప్రిల్‌లోనే.. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని తేల్చిచెప్పారు. మరోవైపు.. పొత్తుల కోసం వెంపర్లాడాల్సిన అవసరం మాకు లేదని అన్నారు మంత్రి.. గెలవలేమని ధైర్యంలేని వాళ్లే పొత్తులకు వెళతారని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీపై మండిపడ్డారు. సంక్షేమ పథకాలు రుచి చూసిన తర్వాత ప్రభుత్వం మారాలని ఎవరూ కోరుకోరని అభిప్రాయపడ్డారు మంత్రి విశ్వరూప్‌. కాగా, హస్తిన పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాను కలిసిన తర్వాత ముందస్తు ఎన్నికలకు కోసమే ఢిల్లీకి వెళ్లారంటూ ప్రచారం జరిగిన విషయం విదితమే.