నభా నటేష్..ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన క్యూట్ లుక్స్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ భామ ఈ మధ్య తన గ్లామర్ షో తో బాగా ఆకట్టుకుంటుంది.అయితే ఈ హాట్ బ్యూటీ ఎలాంటి సినిమాలో నటించడం లేదు.. దాదాపుగా రెండేళ్లుగా ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు కరువయ్యాయి . ఎలాంటి సినిమాను ఇంతవరకు ప్రకటించలేదు. దీంతో అభిమానులు ఈ బ్యూటీ తరువాత సినిమా కోసం తెగ ఎదురు చూస్తున్నారు.నభా నటేష్ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. అలాగే హీరోయిన్ గా అవకాశాలు కూడా అందుకుంది. 2015లో ఈమెకు కన్నడ చిత్రం ‘వజ్రకాయ’లో హీరోయిన్ గా అవకాశం వచ్చింది.. తన అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘నన్ను దోచుకుందువటే’ అనే చిత్రంలో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమాలో నభా నటేష్ సుధీర్ బాబు సరసన నటించింది.. తెలుగు ప్రేక్షకులను మొదటి చిత్రంతోనే ఆకట్టుకుంది..
ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన ‘ఇస్మార్ట్ శంకర్’లో అవకాశం వచ్చింది.ఈ సినిమాలో నభా తెలంగాణ అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది.. ఆ సినిమాలో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది ఈ భామ. ‘ఇస్మార్ట్ శంకర్ తర్వాత తెలుగు వరుసగా ఆఫర్లు అందుకుంది. ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్’మరియు ‘అల్లుడు అదుర్స్’, చివరిగా ‘మ్యాస్ట్రో’ సినిమాలో ఈ భామ నటించింది. కానీ ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ కనిపిస్తోంది. తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంది.తాజాగా నభా నటేష్ కొన్ని హాట్ ఫొటోస్ షేర్ చేసింది.. వాటిలో ఈ భామ సూపర్ స్టైలిష్ లుక్ లో మెరిసింది. కిల్లింగ్ లుక్స్ తో కట్టిపడేసింది. టెంప్టింగ్ ఫోజులతో మైండ్ బ్లాక్ చేసింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.