NTV Telugu Site icon

Peddireddy Ramachandra Reddy: కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ షర్మిల.. హాట్‌ కామెంట్లు చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Peddireddy

Peddireddy

Peddireddy Ramachandra Reddy: వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసిన వైఎస్‌ షర్మిల.. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సహా పలువకు కాంగ్రెస్‌ దిగ్గజాల సమక్షంలో.. కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్నారు.. అంతేకాదు.. ఏపీలో ఆమెకు కాంగ్రెస్‌ పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందనే చర్చ సాగుతోంది. అయితే, ఈ పరిణామాలపై హాట్‌ కామెంట్లు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. మా కాళ్లను మేం నరుక్కోం.. కాంగ్రెస్ పార్టలో ఎవరు ఉన్నా రాజకీయ ప్రత్యర్ధిగానే చూస్తాం అన్నారు. ఇక, రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజం.. సీఎం వైఎస్ జగన్ మా నాయకుడు ఆయన కోసం మేం ఎప్పటికీ పని చేస్తూనే ఉంటాం అన్నారు.

Read Also: YS Sharmila: మా నాన్న వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడుస్తున్నా.. సంతోషంగా ఉంది

కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఇలా ఎన్ని పార్టీలు వచ్చినా మేం, మా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వెంటే నడుస్తాం అన్నారు మంత్రి పెద్దిరెడ్డి.. కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం సోనియా గాంధీ, చంద్రబాబుది అంటూ మండిపడ్డారు.. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్న ఆయన.. రాష్ట్ర ప్రజలందరూ సీఎం వైఎస్ జగన్ ను గెలిపించాలని చూస్తున్నారని స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నా.. మా పార్టీకి వ్యతిరేకంగా ఉంటే ప్రత్యర్థిగా చూస్తాం అన్నారు. మరోవైపు, జెడ్పీటీసీగా ఓడిన వ్యక్తిని మేం ఎమ్మెల్యేగా గెలిపించాం.. ఇలాంటివి మాట్లాడే ముందు ఆలోచన చేయాలన్నారు. ఎవరో రెచ్చగొడితే అలా మాట్లాడటం సబబు కాదు అని.. ఇప్పటికైనా అయన పునరాలోచలో చేయాలని కోరుకుంటున్న.. ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. గతంలో మా నాయకుడు వైఎస్‌ జగన్ పై అక్రమ కేసులు బనాయించి 16 నెలలు జైలుపాలు చేశారని మండిపడ్డారు. అందుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు.. మా కాళ్లను మేం నరుక్కోం.. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నా రాజకీయ ప్రత్యర్ధిగానే చూస్తాం అని కామెంట్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Show comments