Site icon NTV Telugu

Minister Peddireddy: రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సీఎం జగన్ సిద్ధం సభలు..

Peddireddy

Peddireddy

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర నేపథ్యంలో జిల్లా నేతలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జీలు హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈనెల 27న ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. ఇడుపులపాయలో వైఎస్సాఆర్ ఘాట్ వద్ద నివాళులు ఆర్పించనున్నారు.. ఇక, ప్రొద్దుటూరులో వైసీపీ మొదటి సభ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ప్రచారానికి జగన్ సిద్ధం సభలు ఏర్పాటు చేయబోతున్నాని ఆయన తెలిపారు. తొలి విడతలో బస్సు యాత్ర.. ఆతర్వాత ఎన్నికల ప్రచార సభ ఉంటుందన్నారు. మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర కొనసాగనుంది.. రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో సభల నిర్వహణ ఏర్పాటు చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వెల్లడించారు.

Read Also: JayaPrakash Narayana: ఏపీలో రెడ్లకు కమ్మ- కాపుల మధ్య పోరాటం.. రాష్ట్రాన్ని కులాల క్షేత్రంగా మార్చకండి..

బస్సు యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకూ జనంలోనే జగన్ ఉండనున్నారు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. దాదాపు 21రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది.. బస్సు యాత్రలో భాగంగా ఉదయం నేతలతో సమావేశం.. ఆ తర్వాత మధ్యాహ్నం భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి.. అలాగే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాలో సిద్ధం సభలలో పాల్గొంటారు అని ఆయన పేర్కొన్నారు. ఇడుపులపాయ లో వై ఎస్ ఆర్ ఘాట్ వద్ద నివాళీలు అర్పించి సభలు ప్రారంభిస్తామన్నారు.. మొదటి సభ, ప్రొద్దుటూరు, రెండవ సభ నంద్యాలలో, మూడవ సభ ఎమ్మిగనూరులో ఉంటుంది.. కడప, నంద్యాల, కర్నూలు మొదటి ఫేజ్ లో ఉంటాయి… రాయలసీమ జిల్లాల్లో రాప్తాడు సభను తలపించేలా ఈ సభలు ఉంటాయని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పుకొచ్చారు.

Exit mobile version