Site icon NTV Telugu

Peddireddy Ramachandra Reddy: చంద్రబాబుకి భయం అంటే ఏంటి? పతనం అంటే ఏంటో సీఎం జగన్ చూపించారు..!

Peddireddy

Peddireddy

Peddireddy Ramachandra Reddy: చంద్రబాబుకి భయం అంటే ఏంటి? పతనం అంటే ఏంటి? అనేది సీఎం వైఎస్‌ జగన్‌ చూపించారని వ్యాఖ్యానించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిత్తూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు తప్పు చేయలేదు అని లాయర్లు, టీడీపీ నాయకులు మాట్లాడలేదు.. 24 గంటలు దాటాక కోర్టుకు ప్రవేశ పెట్టారు, గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు అని టెక్నికల్ పాయింట్స్ మాట్లాడారని దుయ్యబట్టారు.. ప్రభుత్వ కార్యక్రమాలకు కోర్టులో స్టే తెస్తే అది సక్రమం, చంద్రబాబును అరెస్ట్ చేస్తే అది అక్రమం అంటూ ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల బిల్లు, ఇంగ్లీష్ మీడియం, ఇళ్ల పట్టాలుపై స్టే తెచ్చారు.. ఇక, తనపై రాజశేఖర్ రెడ్డి 26 ఎంక్వైరీలు వేశారు.. కానీ, ఏమీ చేయలేదు అని చంద్రబాబు అనేక సందర్భాల్లో తెలిపారు.. కానీ, సీఎం జగన్ అధ్వర్యంలో చంద్రబాబు అవినీతి బయట పడిందన్నారు పెద్దిరెడ్డి.

Read Also: Sameera Sherief: రక్తమోడే ఫోటో షేర్ చేసిన నటి.. అసలు ఏమైంది?

ఇక, ప్రజలు రావట్లేదు అని స్వయంగా అచ్చెన్నాయుడు టెలీ కాన్ఫరెన్స్ పెట్టి బాధపడ్డారని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి.. టీడీపీ బంద్‌కు పిలుపునిస్తే హెరిటేజ్ కూడా మూతపడలేదన్న ఆయన.. చంద్రబాబు సొంత గ్రామంలో కూడా షాపులు తెరిచున్నాయన్నారు. గతంలో చిదంబరం కాళ్లు పట్టుకుని వైఎస్‌ జగన్‌ ను అక్రమంగా జైలుకు పంపారు.. 16 నెలలు జగన్ మోహన్ రెడ్డిని జైలులో పెట్టారు.. కానీ, ఒక్క రోజు చంద్రబాబు జైలులో ఉంటే విలవిలలాడుతున్నారు అంటూ ఫైర్‌ అయ్యారు. మరోవైపు.. కేబినెట్‌ సబ్ కమిటీలో అనేక అంశాల్లో అవినీతిపై రిపోర్ట్ ఇచ్చాం.. త్వరలో అవన్నీ బయటకు వస్తాయన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినప్పుడు, ఓటుకు కోట్లు అప్పుడు కూడా అనేక మీడియా సంస్థలు, వ్యక్తులు చంద్రబాబుకు మద్దతు పలికారన్న ఆయన.. పురంధేశ్వరి కూడా చంద్రబాబు టీమ్ లో చేరిపోయారంటూ ఆరోపణలు గుప్పించారు. బెయిలు, హౌస్ అరెస్ట్ లాంటి అనేక పిటిషన్లు వేశారు.. భగవంతుడు చేసిన పాపాలు పండెలా చూస్తారన్నారు. రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రక్రియ ప్రారంభమైంది.. ఎక్కువ కేసులు ఉంటే పదవులన్న లోకేష్ వ్యాఖ్యలే ఉదాహరణగా పేర్కొన్న ఆయన.. చంద్రబాబు అనే వ్యవస్థ రామ్ లీల మైదానంలో రావణుడి లా కూలిపోయింది.. ఇందుకు కారణం సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అనేక స్కాం లు జరిగాయి.. వాటి పై కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుందని పేర్కొన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Exit mobile version