NTV Telugu Site icon

Peddireddy: రాబోయే ఎన్నికల్లో బాలయ్యపై పోటీకి బీసీ మహిళ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు..

Peddireddy

Peddireddy

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ పరిధిలోని కిరికెరలో వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురం ఒక అద్దాల మేడ.. రాయి వేస్తే పగులుతుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బాలయ్యపై పోటీకి బీసీ మహిళను ప్రయోగిస్తున్నామని వ్యాఖ్యలు చేశారు. హిందూపురంలో రాబోయే ఎన్నికల్లో బాలకృష్ణ అయినా.. ఆయన అల్లుడు అయినా.. ఆయన వియ్యంకుడు చంద్రబాబు అయినా ఓడిపోవాల్సిందేనని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో హిందూపురంలో బాలకృష్ణ వర్సెస్ బీసీ మహిళగా పోటీ ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

Read Also: YSRCP: ముగిసిన నర్సరావుపేట పంచాయతీ..

2014, 2019లో టీడీపీకి ఓటు వేశారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఒక్కసారైనా జగన్ కు ఓటు వేయాలని ఆలోచన చేయండని తెలిపారు. అబద్దాలు చెప్పి గెలిచిన వాళ్ళకే మళ్ళీ ఓట్లు వేస్తారా? అని ప్రశ్నించారు. హిందూపురంలో గెలిచిన ఎమ్మెల్యే బాలకృష్ణ హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. 2024లో వైసీపీకి ఓటు వేసి జగన్ కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోయినా.. బాలకృష్ణకు ఓట్లు వేయడం వింతగా ఉందన్నారు. వైసీపీ అభ్యర్ధి దీపికకు రాబోయే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి కోరారు. టీడీపీ నాయకులకు ఓట్లు అడిగే ధైర్యం లేదు.. చంద్రబాబు, జగన్ కు.. నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు.

Read Also: Dil Raju: ఇప్పటిదాకా ఊరుకున్నా ఇక నా జోలికి వస్తే తాట తీస్తా… వారికి దిల్ రాజు స్ట్రాంగ్ వార్నింగ్