NTV Telugu Site icon

Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు మొదటి ముద్దాయి..! కేసు నమోదు చేయాలి

Peddireddy

Peddireddy

Peddireddy Ramachandra Reddy: పుంగనూరు ఘటనపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు.. చంద్రబాబు రౌడీ మూకలను రెచ్చగొట్టారన్న ఆయన.. డబుల్ బ్యారెల్ గన్స్ కూడా పెట్టుకుని వచ్చారని ఆరోపించారు. చంద్రబాబు మాటలకు రెచ్చిపోయి పోలీసు వాహనాలపై వారు దాడి చేశారు. ఒక పద్ధతి ప్రకారం మొత్తం చేశారు. చంద్రబాబుకు దిగజారుడు తనం, నిరాశా నిస్పృహతో ఇలాంటి చర్యలకు ఒడికట్టారని విమర్శించారు. చంద్రబాబు నాయుడును మొదటి ముద్దాయిగా కేసు నమోదు చేయాలని సూచించారు. దౌర్జన్యానికి పాల్పడిన వారి వీడియోలు కూడా స్పష్టంగా ఉన్నాయన్న ఆయన.. కావాలనే చంద్రబాబు రెచ్చ గొట్టారని ఆరోపించారు.

Read Also: Rains Alert: తెలంగాణలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షం

నిన్న రాత్రి చంద్రబాబు పుంగనూరు లోపలికి రారు, బైపాస్‌లో వెళ్తారని ప్రెస్‌స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.. కానీ, ఆ తర్వత కావాలనే పుంగనూరు లోపలి వెళ్లి రచ్చ చేయాలని చూశారని ఫైర్‌ అయ్యారు మంత్రి పెద్దిరెడ్డి.. ఇక, చంద్రబాబు మానసిక స్థితి సరిగ్గా లేకపోయి ఉండాలి లేదా నిరాశ నిస్పృహతో ఇలా వ్యవహరించి ఉండాలన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న పథకాలతో ఇక గెలవలేను అని చంద్రబాబు డిసైడ్‌ అయ్యారు. మంచి డాక్టర్‌కు చూపించుకుని, ప్రజాస్వామ్యం పద్ధతిలో ఎన్నికల్లో పోటీ పడాలన్నారు. గతంలో 60 లక్షల దొంగ ఓట్లతో చంద్రబాబు ఎన్నికలకు వెళ్లారని ఆరోపించారు. ఈ రోజు పుంగనూరు ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి, వారిని రెచ్చగొట్టిన చంద్రబాబును మొదటి ముద్దాయిగా కేసు నమోదు చేయాలని వ్యాఖ్యానించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.