NTV Telugu Site icon

Peddireddy Ramachandra Reddy: నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. ఈసారి గతంకంటే ఎక్కువ సీట్లు..!

Peddireddy On Chandrababu

Peddireddy On Chandrababu

Peddireddy Ramachandra Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఫైర్‌ అయ్యారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుక పేరుతో డబ్బులు వసూలు చేశారా లేదా.. ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? అని ప్రశ్నించారు. కేబినెట్ సబ్ కమిటీ ద్వారా ఇసుక పాలసీ తీసుకు వచ్చింది.. కేంద్ర ప్రభుత్వం కు చెందిన ఎంఎస్‌టీసీ ద్వారా టెండర్లు పిలిచాం అని తెలిపారు. అయితే, 14 ఏళ్లలో చంద్రబాబు ఒక్క సంక్షేమ పథకం తెచ్చింది లేదని విమర్శించారు. చంద్రబాబు ఇసుక టెండ లో పాల్గొనాలి.. 375 రూపాయలు టన్నుకు కేటాయించాం, అదనంగా వంద రూపాయలు మేయింటేన్స్ చార్జెస్ పెంచి 475 కు అందుబాటులో తెచ్చారని తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఉచిత ఇసుక విధానం పేరు చెప్పి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేశారా లేదా చెప్పాలి అంటూ డిమాండ్‌ చేశారు.

Read Also: Chiranjeevi: చిరంజీవిని కలిసిన అల్లు అర్జున్..మోకాలి సర్జరీ తరువాత మొదటి ఫొటో ఇదే!

చంద్రబాబు ఇసుక తీస్తే 100 కోట్లు ఎన్‌జీటీ ఫైన్ వేసిందన్నారు పెద్దిరెడ్డి.. అధికారులపై చర్యలు తీసుకుంటే.. సెక్రటేరియట్ లో పంచాయితీ చేసి పంపించారు.. ఇసుక పేరుతో నీ పాలనలో దోచుకున్నది ప్రజలకు చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. నువ్వు నీ కుమారుడు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కు ఇసుక తరలించ లేదా..? అని ప్రశ్నించారు. నీ పాలనలో ఉచిత ఇసుక పేరుతో వేల కోట్లు పక్కదారి పట్టాయి.. ఇసుక కాట్రాక్టర్ కు అప్పగించారు, నిర్వహణ బాధ్యత వాళ్లది.. నువ్వు అల్టిమేటం ఇస్తే.. లేని పోని వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల్ని పక్కదారి పట్టించి అధికారంలోకి రావాలని చూస్తున్నారని దుయ్యబట్టిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 2018-19లో 60 దొంగ ఓట్లు టీడీపీలో హయాంలో 60 లక్షలు ఓట్లు చేర్చారు.. దొంగ ఓట్లను తొలగించే ప్రక్రియ చేపట్టాం, మా పార్టీ ఎంపీలు కేంద్రం ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్లాం.. కేంద్రం హోం మంత్రిని కలుస్తున్నారు.. 36 వేల దొంగ ఓట్లు కుప్పంలో చేర్చారు.. గత ప్రభుత్వ హయాంలోనే ఇది జరిగిందని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.