Site icon NTV Telugu

Peddireddy Ramachandra Reddy: చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్‌.. నమ్మి మోసపోవద్దు..!

Peddireddy On Cbn

Peddireddy On Cbn

Peddireddy Ramachandra Reddy: చిత్తూరు పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పుంగనూరులో ఏరియా ఆసుపత్రి ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు పై ఫైర్ అయ్యారు.. చంద్రబాబు మేనిఫెస్టోలో ఇంటికి ఒక బంగారు ముద్ద ఇస్తానని చెప్తాడు.. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ట్రాక్టర్ ఇస్తానంటాడు.. యువకులకు మోటార్ సైకిల్ ఇస్తాను అంటాడు.. చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు నమ్మి మోసపోవద్దు అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు..

ఇక, సదుంలో నూతనంగా నిర్మించిన 50 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇసుక పాలసీపై మాట్లాడారు.. ఇసుక సీఎం వైఎస్ జగన్ తమ్ముడికి ఇస్తున్నాం అని విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇప్పటికే టెండర్లు పిలిచాం, నాలుగు కంపెనీలు ముందుకు వచ్చాయి.. టెండర్లకు ఇంకా సమయం ఉంది… ఇంకా ఏమి కాకముందే సీఎం సోదరుడి పేరు చెప్పి విమర్శిస్తున్నారని మండిపడ్డారు.. కనీసం ఒక్కసారి కూడా సచివాలయం మొహం చూడని వైఎస్ జగన్ ను 16 నెలలు జైలు లో పెట్టారు.. కానీ, ఆధారాలతో దొరికిపోయిన కూడా చంద్రబాబు తప్పు ఏం చేయలేదు అంటున్నారని దుయ్యబట్టారు.. కొంత మంది ఏదో అన్యాయం జరిగింది అని రాద్ధాంతం చేస్తున్నారంటూ టీడీపీ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

ఇక, పుంగనూరులో ఏరియా ఆసుపత్రిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు పై మండిపడ్డారు.. తెలుగుదేశం పార్టీని టెర్రరిస్టులతో పోల్చిన నారాయణస్వామి. వెన్నుపోటు దారుడు చంద్రబాబు.. ఎన్టీఆర్ పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Exit mobile version