Site icon NTV Telugu

AP Cabinet Meeting: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 500 ఎకరాలు.. అమరావతిలో లా యూనివర్సిటీ!

Ap Cabinet Meeting

Ap Cabinet Meeting

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 500 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటు జరగనుందని, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏలూరులో ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. టూరిజం పాలసికి లోబడి కొన్ని ప్రాజెక్ట్‌లు వస్తాయని, వైజాగ్ త్వరలో అద్భుత నగరం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ భేటీ అనంతరం నిర్ణయాలను మంత్రులు పార్థసారథి, నాదెండ్ల మనోహర్‌ మీడియాకు వెల్లడించారు.

Also Read: Nadendla Manohar: ఇకపై రేషన్ వ్యాన్‌లు ఉండవు.. దుకాణాల ద్వారానే పీడీఎస్‌ బియ్యం పంపిణీ!

మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ… ‘కూటమి ప్రభుత్వం లక్ష్యం ఐదేళ్ల కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడం. ఎస్ఐపీబీ సమావేశం తీస్కున్న నిర్ణయాలను క్యాబినెట్ ఆమోదించింది. టూరిజం పాలసికి లోబడి కొన్ని ప్రాజెక్ట్‌లు వస్తాయి వైజాగ్ త్వరలో అద్భుత నగరం అవుతుంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 500 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌ మాదిరి అనేక సౌకర్యాలు ఉంటాయి. అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటు జరగనుంది. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏలూరులో ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ప్రధాన కేంద్రాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది’ అని చెప్పారు.

Exit mobile version