NTV Telugu Site icon

Niranjan Reddy : మీ ఆటలు తెలంగాణలో సాగవు

Niranjan Reddy

Niranjan Reddy

దుబ్బాక పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దుబ్బాక, సిద్దిపేట రెండు నియోజకవర్గాల భారాన్ని హరీష్ రావు మోస్తున్నాడని ఆయన అన్నారు. ఇంకో ఏడాదిలో ఆయన వేరే రూపంలో సేవలు అందియ్యాలన్నారు. సిద్దిపేటలో ఒకప్పుడు చుక్క నీరు లేదని, ఇప్ప్పుడు సిద్దిపేట చుట్టూ నీరే ఉందని ఆయన అన్నారు. పొరపాటున దుబ్బాక సీటును మీరంతా చేజార్చుకున్నారని, బీజేపీ మిషన్ 90 అంటుంది…ముందు 90 మంది అభ్యర్థులను వెతుక్కోండని ఆయన అన్నారు.

Also Read : Hyderabad Metro : హైదరాబాద్‌ వాసులకు శుభవార్త.. న్యూయర్‌ వేడుకల కోసం అర్థరాత్రి వరకు మెట్రోసర్వీసులు
మీ ఆటలు తెలంగాణలో సాగవన్నారు. ఏపీ, కర్ణాటక నుంచి ఇక్కడ కూలి పనుల కోసం వస్తున్నారని, వ్యవసాయంలో తెలంగాణ అగ్ర స్థానంలో ఉందన్నారు. కేసీఆర్‌ కట్టినట్టు భారతదేశంలో బీజేపి వాళ్ళు ఏదైనా పెద్ద ప్రాజెక్టు కట్టారా అని ఆయన ప్రశ్నించారు. మీరు కట్టరు.. మేము కడితే మా మీద నిందలు వేస్తారని, ఎంత కష్టం వచ్చినా రైతు బంధును ఆపలేదని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రికి మనమంతా అండగా ఉండాలని ఆయన కోరారు.