Site icon NTV Telugu

Minister Niranjan Reddy: రాహుల్ ఎన్ని సార్లు వచ్చినా అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే

Niranjan Reddy

Niranjan Reddy

తెలంగాణ భవన్ లో మీడియాతో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మీద ప్రజలకు విసుగు ఉంది అని ఆయన అన్నారు. అపుడు కాంగ్రెస్ పాలనలో చేసిన పాపాలను ప్రజలు మరచిపోవడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్- బీజేపీ ఒక్కటేనని దుష్పచారం చేస్తున్నారు.. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీ పార్టీలు కుమ్మక్కయ్యాయి.. ఇంకా సిగ్గు లేకుండా మమ్మల్ని విమర్శిస్తున్నారు అంటూ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Putin: పుతిన్ ప్రసంగ సమయంలో యూరప్ ప్రతినిధుల వాకౌట్..

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చామని ఇంకెన్ని సార్లు చెప్పుకుంటుంది అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఎన్ని సార్లు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అంటూ ఆయన చురకలు అంటించారు. దేశమంతా ఉచిత కరెంటు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ దమ్ముంటే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ది జాతీయ పార్టీ కాదా.. వ్యవసాయం మీద ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఉంటుందా.. కాంగ్రెస్ ది శునకానందం.. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు అంటూ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం పాటుపడేది దేశంలో ఒక్క బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని అని ఆయన తెలిపారు. తమ మేనిఫెస్టో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉందని మంత్రి అన్నారు. ఇంత చేస్తున్న బీఆర్‌ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

Exit mobile version