Site icon NTV Telugu

Handri Neeva Project: హంద్రీనీవాకు ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదు.. మంత్రి నిమ్మల ఫైర్!

Nimmala Ramanayudu

Nimmala Ramanayudu

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే జగన్.. రాయలసీమ జీవనాడి అయిన హంద్రీనీవాకు ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదని విమర్శించారు. కనీసం మోటార్లకు బిల్లులు చెల్లించలేదని, తట్టమట్టి తీయలేదని మండిపడ్డారు. ఐదేళ్ళలో జగన్ చేయలేని పనిని, మొదటి ఏడాదిలోనే కూటమి ప్రభుత్వంలో పూర్తి చేసి చూపించాం అని మంత్రి చెప్పారు. కర్నూలులో ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష నిర్వహించాడు. ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తి, ప్రాజెక్టు సీఈలు, ఎస్ఈలు, ఈఈలు సమావేశానికి హాజరయ్యారు.

Also Read: Gummadi Sandhya Rani: పొరపాటు జరిగితే సరిచేసుకుంటాం.. రాజకీయం చెయ్యడం ఏంటి?

‘హంద్రీనీవా పరిధిలో 517 ట్యాంకులకు గానూ 299 ట్యాంకులు నింపాము. మిగిలిన అన్ని ట్యాంకులు నింపేలా ప్రణాళికతో పని చేస్తున్నాం. రిజర్వాయర్లన్నీ 961 టీఎంసీల సామర్ద్యం ఉంటే.. 844 టీఎంసీలతో 87.86 శాతం నీటిని నిల్వ చేయగలిగాం. ఇప్పటికే 93 శాతం రిజర్వాయర్లన్నీ కూడా నిండి ఉన్నాయి. సీఎం చంద్రబాబు వాటర్ మేనేజ్మెంట్ వల్లే ఇదంతా సాధ్యమైంది. రూ.3850 కోట్లు ఖర్చుపెట్టి 738 కిమీ శివారు ప్రాంతానికి సైతం కృష్ణా జలాలు తీసుకెళ్ళాం. రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే వైఎస్ జగన్.. రాయలసీమ జీవనాడి అయిన హంద్రీనీవాకు ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదు. మోటార్లకు బిల్లులు చెల్లించలేదు, తట్టమట్టి తీయలేదు. ఐదేళ్ళలో జగన్ చేయలేని పనిని మేం మొదటి ఏడాదిలోనే పూర్తి చేసి చూపించాం’ అని మంత్రి నిమ్మల చెప్పుకొచ్చారు.

 

Exit mobile version