Minister Nimmala Ramanaidu: క్యూసెక్కులు, టీఎంసీలకు తేడా కూడా తెలియదు..!
- క్యూసెక్కులు.. టీఎంసీలకు తేడా తెలియని వైసీపీ నేతలు సాగునీటి వ్యవస్థను భ్రష్టు పట్టించారు..
- దానికి పులిచింతల.. పోలవరం ఒక ఉదాహరణగా నిలిచాయి..
- మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nimmala Ramanaidu: క్యూసెక్కులకు, టీఎంసీలకు తేడా తెలియని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగునీటి వ్యవస్థను భ్రష్టు పట్టించారు అనడానికి పులిచింతల, పోలవరం ఒక ఉదాహరణగా నిలిచాయాని విమర్శించారు ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు… ప్రజల తాగు నీటి అవసరాలు కూడా ప్రాజెక్టులలో నీటిని నిలువ చేయలేకపోయారని మండిపడ్డారు. పట్టిసీమ డెలివరీ పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి నిమ్మల.. తన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయమని అధికారులను.. విశాఖపట్నం పంపిన వైఎస్ జగన్.. ప్రజల తాగునీటి అవసరాలకు మాత్రం చర్యలు తీసుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. కరువు రహిత దేశంగా, రాష్ట్రంగా ఉండాలి అంటే నదుల అనుసంధానం ముఖ్యం అని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుంది.. కాబట్టి, ముందు చూపుతో పట్టిసీమ ప్రారంభించారన్నారు. పట్టిసీమ ప్రారంభించినప్పుడు ఒట్టి సీమ అంటూ.. వైఎస్ జగన్ అవహేళన చేశారని, ఇప్పుడు అదే పట్టిసీమ ద్వారా రైతుల కష్టాలు తీర్చుతున్నమని స్పష్టం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.
Read Also: Bhole Baba Missing: పరారీలో భోలే బాబా.. హత్రాస్లో 121కి చేరిన మృతుల సంఖ్య..
Also Read
- Mumbai: సునేత్ర పవార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
- Punjab Politics: పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు..? ప్రధానితో సుఖ్బీర్ భేటీ..
- Pakistan: ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
- YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
అయితే, పోలవరం కుడి కాలువలో గోదావరి నీరు పరవళ్లు తొక్కుతోంది. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి ఈ ఉదయం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక పూజల అనంతరం గోదావరి నీటిని విడుదల చేశారు. దీంతో 1000 క్యూసెక్కుల నీరు పట్టిసీమ డెలివరీ పాయింట్ వద్ద ద్వారా పోలవరం కుడి కాలువలోకి చేరుతోంది. కృష్ణ డెల్టా రైతులకు సాగునీరు అందించేందుకు ముందస్తుగా పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. భవిష్యత్తు అవసరాల మీద నీటి విడుదల శాతాన్ని అధికారులు మరింత పెంచానున్నారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ.. కరువు రహిత దేశంగా, రాష్ట్రంగా ఉండాలి అంటే నదుల అనుసంధానం ముఖ్యం అని నమ్మిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. సముద్రంలో వృథాగా పోతున్న నీటిని ఒడిసి పట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చ్చేందుకు పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.. ఇక, సీజన్ సీజన్ కు మార్పులు వచ్చే ప్రాజెక్టులో కాంట్రాక్టర్లను మార్చ వద్దని చెప్పినా వైఎస్ జగన్ వినలేదని మండిడ్డారు.. ఇదే విషయాన్ని ఐఐటి నిపుణులు సైతం చెప్పారు.. 15 నెలల సమయం పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేశారు.. నిపుణులు నెత్తి నోరు కొట్టుకున్నా జగన్ పోలవరం ముంచే వరకు నిద్రపోలేదని విమర్శించారు మంత్రి నిమ్మల రామానాయుడు.
తాజావార్తలు
-
Mumbai: సునేత్ర పవార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
-
Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
-
Punjab Politics: పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు..? ప్రధానితో సుఖ్బీర్ భేటీ..
-
Pakistan: ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
-
YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!