NTV Telugu Site icon

Minister Nimmala Rama Naidu: నవంబర్ రెండవ వారంలో సీఎం పోలవరం ప్రాజెక్టు సందర్శన

Nimmala

Nimmala

Minister Nimmala Rama Naidu: ఇసుకపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇసుకను ఆదాయంగా మార్చుకుందని విమర్శించారు. వారం పది రోజుల్లో ఓపెన్ రీచ్‌లను ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఏ రోజు ఏం పని చేయాలనే దానిమీద ఒక రూట్ మ్యాప్ తీసుకోమని అధికారులను ఆదేశించామన్నారు. వారం రోజుల్లోనే మళ్లీ రివ్యూ నిర్వహిస్తామన్నారు. ఉచిత ఇసుక ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. 228లో రూపాయలకే టన్ను ఇసుక ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తక్కువ ధరకే ఇసుక అందుబాటులోకి వచ్చిందన్నారు. దీనివల్ల ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు.

Read Also: Andhra Pradesh: ఆన్‌లైన్‌లో భ‌వ‌న నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల సేవలు నిలిపివేత

పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. నవంబర్ రెండవ వారంలో ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళతారని చెప్పారు. జగన్ కుటుంబ వివాదంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం టీడీపీకి లేదనీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తల్లిని కోర్టు ఈడ్చిన జగన్ క్యారెక్టర్ ఏంటో రాష్ట్ర ప్రజలకే కాదు దేశం అంతా అర్థమైందనీ వ్యాఖ్యానించారు. తల్లికి కుమారుడికి మధ్య ఆస్తుల ఎంఓయూ ఉంటుందని తొలిసారిగా ప్రజలకు తెలిసిందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జి మంత్రిగా బాధ్యతలు తీసుకుని తొలిసారి రాజమండ్రి కలెక్టరేట్‌లో మంత్రి కందుల దుర్గేష్‌తో కలిసి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుకలో ఇబ్బందులు పరిష్కారం చేస్తామని అన్నారు. నవంబర్ రెండవ వారంలో పోలవరం ప్రాజెక్టు వద్దకు సీఎం చంద్రబాబు వచ్చి పనులపై దిశా నిర్దేశం చేస్తారని మంత్రి నిమ్మల తెలిపారు.

ఉచిత ఇసుకను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా చూస్తామన్నారు. రైతాంగ సమస్యలు నీటి సమస్యలు పరిష్కార మార్గాలు సూచిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కూటమి స్ఫూర్తిగా పనిచేయాలని నిర్ణయించామన్నారు.

Show comments