Site icon NTV Telugu

AP Capital Amaravati: అమరావతి రాజధానికి చట్టబద్ధత..!

Narayana

Narayana

AP Capital Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి చట్టబద్ధత కలిగించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.. దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కలిగించే దిశగా సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడతారన్నారు అని వెల్లడించారు మంత్రి నారాయణ.. చట్టబద్ధత విషయంలో రైతుల్లో ఉన్న ఆందోళన నిన్న సీఎం దృష్టికి రైతులు తీసుకు వచ్చారన్నారు నారాయణ.. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన.. మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లును పరిశీలించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాజధాని అమరావతి కాదని చెప్పింది.. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైందన్నారు.. ఇదే విషయాన్ని రైతులు సీఎం చంద్రబాబు దృష్టికి నిన్న తీసుకువచ్చారు.. న్యాయ పరమైన అంశాలు చర్చించి కేంద్రంతో మాట్లాడతా అని సీఎం చంద్రబాబు.. రైతులకు చెప్పారని వెల్లడించారు..

Read Also: Canada Elections Results: ఆధిక్యంలో దూసుకెళ్తున్న మార్క్‌ కార్నీ పార్టీ

ఇక, ప్రధాని పర్యటనకు సంబంధించి పనులు దాదాపు పూర్తి అయ్యాయని తెలిపారు మంత్రి నారాయణ.. 41 వేల కోట్ల విలువైన పనులకు శంఖుస్థాపన గతంలో జరిగింది.. గత ప్రభుత్వం టెండర్లు రద్దు చేయలేదు.. న్యాయపరంగా ఇబ్బందులు వచ్చాయన్నారు.. మళ్లీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని పనులు ప్రారంభం అయ్యాయి.. 8 నెలలు నుంచి రాజధానిపై కసరత్తు చేస్తున్నాం అన్నారు.. మళ్లీ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద పనులు మళ్లీ ప్రారంభం అవుతాయని తెలిపారు మంత్రి నారాయణ.. కాగా, ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ విభజన చట్టంలో పార్లమెంటు ద్వారా సవరణ చేసేందుకు అవకాశం ఉందేమో పరిశీలించి, చేయిద్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్న విషయం విదితమే.. ఈ అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళతానని.. రాజధాని ప్రాంత రైతులకు హామీ ఇచ్చారు. విభజన చట్టంలో రెండు తెలుగు రాష్ట్రాలకు పదేళ్లపాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు.. ఇప్పుడు ఆ గడువు ముగియడంతో.. ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసేందుకు ఇబ్బంది ఉండకపోవచ్చని సీఎం చంద్రబాబు పేర్కొన్న విషయం విదితమే..

Exit mobile version