Vizag Metro Rail project: విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై శాససనమండలి ప్రశ్నోత్తరాల్లో సమాధానం ఇచ్చిన మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై సమగ్ర రవాణా ప్రణాళిక కేంద్రానికి పంపించాం. కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తాం అని స్పష్టం చేశారు.. ఇక, వంద శాతం కేంద్రమే నిధులు భరించేలా నిర్మాణం చేపట్టాలని కోరామని వెల్లడించారు.. మొదటి ఫేజ్ లో 46.2 కిలోమీటర్లతో మూడు కారిడార్ల నిర్మాణం జరగనుందన్న ఆయన.. మొదటి ఫేజ్ లో స్థానిక ఎమ్మెల్యేలు కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు.. ఈ కారిడార్స్ లో హనుమంతు వాక, మద్దెలపాలెం, విప్రో జంక్షన్, గురుద్వారా, అక్కయ్యపాలెం ప్రాంతాలలో 14 జంక్షన్లు ఉన్నాయని తెలిపారు.. ఈ ప్రాంతాలలో 8 మీటర్ల ఫ్లై ఓవర్, దానిపైన మెట్రో నిర్మాణం చేయమని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు డీపీఆర్ చేయాలని నిర్ణయించామని శాసనమండలిలో ప్రకటించారు మంత్రి పొంగూరు నారాయణ.
Read Also: Mechanic Rocky Review: విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ రివ్యూ!