Minister Narayana: గత రెండు మూడు రోజులుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ ‘జీరో’ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. అయితే, మంత్రి నారాయణ విశాఖపట్నం పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. నారాయణను కలిశారు పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ… వర్మను జీరో చేశామనే వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ.. టెలీ కాన్ఫరెన్స్ లో నేను మాట్లాడిన మాటలను కట్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని మండిపడ్డారు..
Read Also: Tripura: పశువుల్ని దొంగించేందుకు వచ్చి, చచ్చారు.. బంగ్లాదేశీయుల మృతిపై వివాదం..
నెల్లూరు నాయకులతో మాట్లాడుతూ పిఠాపురంలో వున్న సమస్యలను ప్రస్తావించాను… పిఠాపురంలో జనసేన, టీడీపీ ద్వితీయ శ్రేణి మధ్య ఉన్న విభేదాలను చర్చించి “జీరో” చేశామని నేను చెప్పాను అన్నారు మంత్రి నారాయణ.. అయితే, కంటెంట్ మొత్తం బహిర్గతం చేసి ఉంటే వక్రీకరణలు ఎలా జరిగాయో అర్థం అయ్యేది అన్నారు. వక్రీకరించి విభేదాలు సృష్టించడం ఎవరి వల్ల కాదు అని స్పష్టం చేశారు.. NDA కూటమి చాలా స్ట్రాంగ్ గా ఉంది… ఇండిపెండెంట్ గా 50 వేల ఓట్లతో గెలిచిన బలమైన నాయకుడు వర్మ అని కొనియాడారు.. పిఠాపురంలో జనసేన, టీడీపీ సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయి అని వెల్లడించారు మంత్రి నారాయణ..
