Minister Nara Lokesh: సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి.. లోకేష్ ఆదేశాలు.

  • సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి అంటూ అధికారులను ఆదేశించారు మంత్రి నారా లోకేష్‌
  • మంగళగిరి ప్రజల కోసం ప్రజాదర్బార్ నిర్వహించారు లోకేష్
  • నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహించారు
Lokesh

Lokesh

Minister Nara Lokesh: సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి అంటూ అధికారులను ఆదేశించారు మంత్రి నారా లోకేష్‌.. మంగళగిరి ప్రజల కోసం ప్రజాదర్బార్ నిర్వహించారు లోకేష్.. తన నివాసంలో ప్రజలను కలుసుకున్నారు.. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.. గత ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా సేవా కార్యక్రమాలు చేపట్టిన నారా లోకేష్.. ఇటీవల ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించిన విషయం విదితమే.. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ప్రకటించారు.. ఇక, నియోజకవర్గ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేశారు.. ఈ రోజు ప్రజా దర్బార్‌లో మంత్రి నారా లోకేష్‌ను కలిసిన మంగళగిరి వాసులు.. వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి లోకేస్‌.. అంతేకాదు.. తక్షణమే సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి నారా లోకేష్‌. ఇక, మంత్రి హోదాలో తొలిసారి ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్న నారా లోకేష్‌ని ఈ సందర్భంగా కొందరు అభిమానులు, టీడీపీ శ్రేణులు కూడా కలిసి ఆయనకు శుభాకాక్షంలు తెలియజేశారు.

Read Also: Fire Accident: ఘజియాబాద్లోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..