Minister Nara Lokesh: ఐటీఐ, పాలిటెక్నిక్ పూర్తిచేసిన ప్రతిఒక్కరికీ ఉద్యోగం రావాలి..
- ఐటీఐ.. పాలిటెక్నిక్ పూర్తిచేసిన ప్రతిఒక్కరికీ ఉద్యోగం రావాలి
- అందుకు అనుగుణంగా పాఠ్యప్రణాళికను ప్రక్షాళన చేయండి
- నెలాఖరులోగా మంగళగిరిలో స్కిల్ సెన్సస్ పూర్తిచేయాలి
- మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కుకు ప్రణాళికలు సిద్ధం చేయండి
- స్కిల్ డెవలప్ మెంట్ సమీక్షలో మంత్రి నారా లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: రాష్ట్రంలోని ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్య పూర్తి చేసిన ప్రతిఒక్కరికీ ఉద్యోగం లభించే విధంగా పాఠ్యప్రణాళికను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… తమ హయాంలో ఐటీఐ, పాలిటెక్నిక్ చదివిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. రాబోయే అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ముఖ్యమంత్రి ఆలోచనా విధానానికి అనుగుణంగా స్కిల్ డెవలప్ మెంట్ విభాగం పనిచేయాలని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ విభాగం చేపట్టే కార్యక్రమాల్లో అంతిమంగా అవుట్ కమ్స్ రావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా అనంతపురంలో ఆటోమోటివ్, కడప, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, ప్రకాశం జిల్లాలో బయోఫ్యూయల్, గోదావరి జిల్లాల్లో ఆక్వా, పెట్రో కెమికల్స్, ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా, డిఫెన్స్ రంగాలపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది.
Read Also: Minister Vangalapudi Anitha: తుఫాన్ నేపథ్యంలో హోంమంత్రి అనిత వరుస సమీక్షలు.. కలెక్టర్లకు ఆదేశాలు
Also Read
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
ఆయా ప్రాంతాల్లోని ఐటిఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధిత రంగాల్లో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. విదేశాల్లో బ్లూకాలర్ జాబ్స్ కు విపరీతమైన డిమాండ్ ఉందని, డిమాండ్ ఉన్న బ్లూకాలర్ జాబ్స్ ను గుర్తించి విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఒక్క జపాన్ లో 50వేలమంది బ్లూకాలర్, నర్సింగ్ ఉద్యోగులు కావాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 29 మోడల్ కెరీర్ సెంటర్లు మంజూరు కాగా, 12 ఇప్పటికే ప్రారంభమయ్యాయని అధికారులు తెలుపగా, మిగిలినవి కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గంలో కొనసాగుతున్న స్కిల్ సెన్సస్ పురోగతిపై మంత్రి లోకేష్ సమీక్షించారు. ఇప్పటివరకు 63, 966 గృహాల్లోని 1,12,680 మందికి (42%) నైపుణ్యగణన పూర్తయిందని చెప్పారు. నియోజకవర్గంలో నెలాఖరు నాటికి స్కిల్ సెన్సస్ పూర్తిచేయాలని, ఇక్కడ గుర్తించిన లోపాలను సరిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెన్సస్ కు శ్రీకారం చుడతామని అన్నారు. స్కిల్ సెన్సస్ డేటాను ఇన్ఫోసిస్ వంటి ప్రఖ్యాత సంస్థలతో ప్రివాలిడేషన్ నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా రాబోయే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్కిల్ సెన్సస్ డేటా సిద్ధం చేయాలని చెప్పారు.
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో రాష్ట్రంలోని ప్రధాన కంపెనీల హెచ్ఆర్లతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకోవాలని మంత్రి సూచించారు. మంగళగిరి నియోజకవర్గంలో జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. కర్నాటకలోని ఉడిపిలో ఉన్న జెమ్స్ అండ్ జ్యుయలరీ సెంటర్‌ను అధ్యయనం చేశామని, త్వరలో ఆ సంస్థ అధికారులను రాష్ట్రానికి ఆహ్వానించి, వారి సూచనలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో 7ఎకరాల విస్తీర్ణంలో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి లోకేష్ కోరారు. స్కిల్ డెవలప్ మెంట్ విభాగం అభివృద్ధి చేస్తున్న నైపుణ్యం పోర్టల్ ను కేంద్రప్రభుత్వ జాబ్ పోర్టల్ తో అనుసంధానించే అంశాన్ని పరిశీలించాలని మంత్రి లోకేష్ సూచించారు. ఈ సమావేశంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండి గుమ్మల దినేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కె.దినేష్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ ఇమ్మని మోహన్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
-
IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
-
Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
-
Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..