Site icon NTV Telugu

Nara Lokesh: ఆర్మీ జవాను భూ సమస్యను పరిష్కరించిన మంత్రి నారా లోకేష్..

Nara Lokesh

Nara Lokesh

దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడే ఆర్మీ జవాన్ కు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. సత్యసాయి జిల్లా అమరాపురం మండలం కె.శివరంలో తన భార్య తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని కబ్జా చేశారంటూ రాష్ట్రానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ డి.నరసింహమూర్తి జమ్మూకశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేశారు.. అమరాపురం మండలం ఉదుకూరుకు చెందిన నరసింహమూర్తి దేశ సరిహద్దుల్లో జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు.

READ MORE: IPL 2025 Final Live Updates: పంజాబ్ vs ఆర్సీబీ మధ్య హైఓల్టేజ్‌.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లైవ్‌ అప్‌డేట్స్..

వైసీపీ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసిన నాగరాజు అనే వ్యక్తి తమ భూమిని కబ్జా చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా మంత్రి నారా లోకేష్ ను జవాన్ విజ్ఞప్తి చేశారు. సదరు వీడియోపై తక్షణమే స్పందించిన మంత్రి నారా లోకేష్.. భూ సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు సర్వే జరిపి పోలీసుల సమక్షంలో హద్దులు నిర్ణయించడంతో సదరు భూ సమస్య పరిష్కారమైంది.

READ MORE: RCB vs PBKS: చివర్లో తడబడ్డ ఆర్సీబీ.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..?

Exit mobile version