Minister Nara Lokesh on AI Revolution: పారిశ్రామిక విప్లవం చూశాం అని, ఇప్పుడు ఏఐ (కృత్రిమ మేధ) విప్లవం చూస్తాం అని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏఐతో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని, వస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నిరంతరం కష్టపడుతున్నారన్నారు. తాను మొదటిసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయానని.. ఆపై ఐదేళ్ల పాటు కష్టపడి గెలిచానని తెలిపారు. కష్టమైన విద్యాశాఖ తీసుకుని.. మార్పు తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. విద్యార్థులే మన ఆస్తి అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. సైయెంట్ ఆధ్వర్యంలో విశాఖలో ఏఐ ల్యాబ్‌ను మంత్రి ప్రారంభించారు.
‘పారిశ్రామిక విప్లవం చూశాం, ఇప్పుడు ఏఐ విప్లవం చూస్తాం. రానున్నది ఏఐ విప్లవం. ఏఐతో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయి, వస్తున్నాయి. భవిష్యత్తులో ఉన్నతంగా వెళ్లాలి. అందుకు లక్ష్యంతో ముందుకు సాగాలి. దేశంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నిరంతరం కష్టపడుతున్నారు. నేను మొదటిసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయాను. ఐదేళ్లు కష్టపడ్డాను గెలిచాను. నన్ను విద్యాశాఖ తీసుకోవద్దని కొందరు చెప్పారు. కానీ కష్టమైన విద్యాశాఖ తీసుకుని మార్పు తీసుకుని రావాలని ప్రయత్నం చేశాను. విద్యాశాఖలో సంస్కరణలు తెచ్చాను. విద్యార్థులే మన ఆస్తి, మన భవిష్యత్. దక్షిణ భారతదేశంలో లెర్నింగ్ టెక్నిక్‌లో మన రాష్ట్రం ముందు ఉంది’ అని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
Also Read: Vizianagaram News: హృదయవిదారక ఘటన.. తల్లికి పురుడు పోసిన కూతురు!
‘రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహించాం. కొత్త టీచర్ నియమకాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ నుంచి కొత్త టీచర్లు విధుల్లో చేరుతారు. పుస్తకాలు మీద ఎవరి బొమ్మలు ఉండవు. కొన్ని పార్టీలకు ఈ అభివృద్ధి నచ్చడం లేదు. వారు వచ్చి నన్ను కలిసి మాట్లాడచ్చు. జీవితంలో ఉపాధ్యాయులను మరచి పోవద్దు. నేను నా గురువులను మరచిపోలేను. ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్ ఆట కట్టించారు మన ప్రధాని. యుద్ధంలో మృతి చెందిన మురళి నాయక్ మన రాష్ట్రం వారే. వారి తల్లి తండ్రులను కలిసి మాట్లాడాను. వారిలో దేశభక్తి మాటలు నన్ను కదిలించాయి. దేశం కోసం పని చేసే జవానులను మనం ఎప్పుడు గౌరవించాలి’ అని మంత్రి నారా లోకేష్ చెప్పారు.