Minister Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నారా లోకేష్

  • ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నారా లోకేష్
  • వర్షం కారణంగా పాఠశాల ప్రాంగణంలో నిలిచిన వర్షపునీరు
Minister Nara Lokesh

Minister Nara Lokesh

Minister Nara Lokesh: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో 30వ వార్డులోని ఎచ్చర్ల వీధిలోని ప్రభుత్వ పాఠశాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. లోకేష్ పర్యటన నేపథ్యంలో స్కూల్ వద్ద దుర్బర పరిస్థితి నెలకొంది. భారీ వర్షం కారణంగా పాఠశాల ప్రాంగణంలో వర్షపునీరు నిలిచిపోయింది. పాఠశాల ప్రాంగణంలోనే ఎప్పుడు కూలుతాదో తెలియని శిథిలావస్థలో ఉన్న భవనం ఉంది. దానిని మంత్రి నారా లోకేష్ పరిశీలించారు.

Read Also: Andhra Pradesh: కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ సమీక్ష

రణస్థలం మండలం పాతర్లపల్లి జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో నిన్న(బుధవారం) నిర్మాణంలో ఉన్న పాఠశాల అదనపు భవనం సజ్జ కుప్పకూలడంతో ఒక విద్యార్థి మృతి చెందిన సంగతి తెలిసిందే. విద్యార్థి మృతి నేపథ్యంలో జిల్లాలోని పాఠశాల పరిస్థితిని తెలుసుకునేందుకు మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా.. ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. విద్యా్ర్థి మృతి పట్ల మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకుంటామని వెల్లడించారు.