NTV Telugu Site icon

Nara Lokesh: “మంగ‌ళ‌గిరితో ముడిప‌డిన బంధం నన్ను చేనేత కుటుంబ‌ స‌భ్యుడిని చేసింది”

Nara Lokesh

Nara Lokesh

మంగ‌ళ‌గిరితో ముడిప‌డిన బంధం న‌న్ను చేనేత కుటుంబ‌ స‌భ్యుడిని చేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర మంత్రి జాతీయ చేనేత దినోత్సవం సంద‌ర్భంగా చేనేత క‌ళాకారులు అంద‌రికీ హృద‌య‌పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చేనేత క‌ళాకారుల క‌ష్టాలు చూశానని..స‌మ‌స్యల‌పై పూర్తి అవ‌గాహ‌న వ‌చ్చిందన్నారు. యువ‌గ‌ళం పాద‌యాత్రలో చేనేత రంగం గురించి అవగాహన కలిగిందని గుర్తుచేశారు. చేనేత రంగం ల‌క్షలాది మంది జీవ‌నానికి ఉప‌యోగ‌ప‌డ‌ుతోందని తెలిపారు. మ‌న సంస్కృతి, సంప్రదాయాల‌ను ప‌రిర‌క్షించే ఓ క‌ళ చేనేత రంగమన్నారు.

READ MORE: IND vs SL: మూడో వన్డే మ్యాచ్ టైగా ముగిస్తే.. సూపర్ ఓవర్!

“చేనేత‌రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామని పాద‌యాత్రలోనే మాటిచ్చాను. స‌మాంత‌రంగా మ‌న మంగ‌ళ‌గిరిలో చేనేత‌ల‌కు చేయూత‌నందించే వీవర్స్ పైల‌ట్ ప్రాజెక్ట్ ప్రారంభించి టాటా త‌నేరా సంస్థతో అనుసంధానం చేశాం.పేద చేనేత కళాకారుల‌కు మ‌గ్గాలు, ఇతర సామగ్రి అందించాను. చేనేత రంగం, కార్మికుల స‌మ‌స్యల‌న్నీ శాశ్వత ప్రాతిప‌దిక‌న ప‌రిష్కరించేందుకు కూట‌మి ప్రభుత్వం ఓ ప్రణాళిక రూపొందిస్తోంది. మ‌న మంగ‌ళ‌గిరి-మ‌న చేనేత అనే నినాదంతో దేశ‌వ్యాప్తంగా మ‌న చేనేత వ‌స్త్రాలకు బ్రాండింగ్ క‌ల్పిస్తున్నాం. ప్రధాని న‌రేంద్ర మోడీని మంగ‌ళ‌గిరి చేనేత క‌ళాకారులు నేసిన శాలువాతో స‌త్కరించాను. నా త‌ల్లి, నా భార్య మంగ‌ళ‌గిరి చేనేత చీర‌లు ధ‌రిస్తూ.. మ‌న చేనేత క‌ళ‌కు మ‌రింత ప్రాచుర్యం క‌ల్పిస్తున్నారు. చేనేత‌ల‌కు చేయూత‌నందించడం మా ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒక‌టి.
చేనేత క‌ళ‌కు పూర్వవైభ‌వం తీసుకొచ్చేందుకు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తాను.” అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తనను ఆశీర్వదించిన చేనేత కుటుంబ‌ స‌భ్యులంద‌రికీ మరోసారి చేనేత దినోత్సవం సంద‌ర్భంగా కృత‌జ్ఞత‌లు తెలిపారు.

Show comments