NTV Telugu Site icon

Nadendla Manohar : రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలకు ఇవాళ ఒక పండుగ

Nadendla Manohar

Nadendla Manohar

బియ్యం, కందిపప్పు ప్రత్యేక కౌంటరు సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజారులో ప్రత్యేక కౌంటరు ఏర్పాటు చేశారు. మచిలీపట్నం లోని రైతుబజారులో కందిపప్పు, బియ్యం స్టాల్ ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. బియ్యం, కందిపప్పు సబ్సిడీ ధరలకు రైతు బజారులో అందుబాటులో ఉంచనుంది ప్రభుత్వం. నిత్యావసర సరకులను రాయితీపై అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకుంది. రైతుబజార్లలో రాయితీపై బియ్యం, కందిపప్పు పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కందిపప్పును కేజీ 160, సోనామసూరి బియ్యాన్ని కిలో 49కు రాయితీ పై అందించనుంది ప్రభుత్వం. ఈ సందర్భంగా ఏపీ సివిల్ సప్లై శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలకు ఇవాళ ఒక పండుగ అని ఆయన వ్యాఖ్యానించారు. సంక్షేమ పధకాలతో పాటుగా నిత్యవసర సరుకులు సరైన ధరలకి అందించడానికి కృషి చేసామన్నారు. ధాన్యం కొనుగోలులో అన్యాయం జరుగుతున్న దానిపైన పోరాటాలు చేసామన్నారు నాదెండ్ల మనోహర్‌.

 

రైతులకు చెల్లించాల్సిన 600 కోట్లు కూడా త్వరలో చెల్లిస్తామన్నారు మంత్రి నాదెండ్ల. ధరల స్ధిరీకరణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్యంగా రీటైలర్స్ తో సమీక్షించామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్‌. 284 ఔట్ లెట్లు లో ఇవాళ కందిపప్పు, బియ్యం అందిస్తున్నామన్నారు. రోజుకు 391 మెట్రిక్ టన్నులు బియ్యం, 125 క్వింటాళ్ళ కందిపప్పు అందుబాటులో ఉంచామని ఆయన అన్నారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సామాన్యులకు అందించడంలో పొరపాటు రాకుండా దాడులు చేస్తున్నామని ఆయన అన్నారు. డిమార్టు, ఉషోదయ, రిలయన్స్ లాంటి మార్టులలో కూడా రీటైల్ గా అందుబాటులో ఉంచుతామన్నారు. కాకినాడలోనే 43249 మెట్రిక్ టన్నులు పిడిఎస్ బియ్యం సీజ్ చేసామన్నారు. నాకున్న సమాచారం ప్రకారం పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపు లో నలుగురు ఐపీఎస్ లు ఉన్నారన్నారు.