NTV Telugu Site icon

Minister Nadendla Manohar: బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్టకు సహకరించాలి..

Nadendla Manohar

Nadendla Manohar

Minister Nadendla Manohar: బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్టకు సహకరించాలని మంత్రి నాదెండ్ల మనోహర్‌ మిల్లర్లను కోరారు. జాతీయ రైస్ మిల్లర్స్ అసోయేషన్ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్‌.. మిల్లర్లపై మార్కెట్ సెస్ 2 శాతం నుంచి 1 శాతానికి తగ్గించాలని మంత్రుల సమావేశంలో చర్చించామన్నారు. బియ్యం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా సహకరిస్తామని మిల్లర్లు హామీ ఇచ్చారు. బియ్యం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని మంత్రికి మిల్లర్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందన్నారు. దేశ వ్యాప్తంగా యూనిఫాం పాలసీ తీసుకు వచ్చే విధంగా అందరం కలిసి లోతుగా అధ్యయనం చేద్దామని వెల్లడించారు. 1550 రైస్ మిల్స్ నేడు ఏపీ వ్యాప్తంగా ఉన్నాయన్నారు. కోస్తాతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఉన్న రైస్ మిల్లర్లను కలుపుకుని వెళ్లాలని సూచించారు. 19వేల 800కోట్లు టర్నోవర్ ఉన్న పౌరసరఫరాలశాఖలో 41వేల 150కోట్లు బకాయిలు చేసి గత ప్రభుత్వం వెళ్లిపోయిందన్నారు. రుణాలు తీసుకుని రైతులకు కూడా చెల్లించకుండా వెళ్లిపోయారని విమర్శించారు. సీఎం చంద్రబాబుతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో రైతుల బకాయిలపై చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. వారి సహకారంతో రూ.1674కోట్ల బకాయిలు రైతులకు నెల రోజుల్లో చెల్లించామన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయ్యే లోపే రూ.283 కోట్లు బకాయిలు చెల్లించాం.. మరో వారం రోజుల్లో 200కోట్లు చెల్లిస్తామన్నారు. కష్టపడి పండించిన ధాన్యం వారికి నచ్చిన చోట అమ్ముకునే స్వేచ్చ రైతులకు కల్పించామన్నారు.

Read Also: AP Assembly: ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మూడు జిల్లాల్లో ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటలు 90 శాతం మందికి… మరో 10 శాతం మందికి ధాన్యం కొనుగోలుకు సంబంధించి డబ్బులు జమ చేశామన్నారు. రైతులు, మిల్లర్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులను ఏర్పాటు చేసి పారదర్శకంగా ఉండేలా కమిటీని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. వరదల సమయంలో బాధితులకు 25కేజీల బియ్యం అందించడంలో మిల్లర్లు ఎంతో సహకారం అందించారన్నారు. మా సబ్ కమిటీలో చర్చ పెట్టి మార్కెట్ సెస్ ఒక శాతానికి తగ్గించేలా క్యాబినెట్ లో పెట్టబోతున్నామని వెల్లడించారు. పీడీయస్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నేను మాట ఇస్తున్నా.. ప్రతి గింజ కొనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎం.డి.యూ యూనిట్లు పెట్టి 1645 కోట్లు ప్రజాధనాన్ని ఉపయోగించారన్నారు. 29 వేల రేషన్ షాపుల ద్వారా ప్రజలకు మంచిగా సరుకులు అందేవని మంత్రి స్పష్టం చేశారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాల నిర్వహణ తేదీ ఖరారైంది. ఈ నెల 11న ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇప్పటివరకూ ఉన్న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

Show comments