Minister Nadendla Manohar: ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని మాట్లాడారు. పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కాకుండా పీడీ యాక్ట్ పెట్టాలని చట్టం తెచ్చామన్నారు. వినియోగదారుడికి కొన్ని హక్కులు ఉన్నాయని.. వినియోగదారుడికి వ్యాపారులు కొన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు అమ్మకందారులు కూడా బాధ్యతగా ఉండాలంటే చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మొక్కుబడిగా అవగాహన కార్యక్రమం చేయటం కాకుండా చిత్తశుద్ధితో హక్కులను గుర్తించి తెలుసుకోవాలన్నారు. వినియోగదారుడు ఫైట్ చేస్తే ఆలస్యమైనా విజయం దక్కటం ఖాయమన్నారు.
Read Also: Srisailam Temple: జనవరి 1న శ్రీశైలంలో స్పర్శదర్శనాలు, ఆర్జిత అభిషేకాలు నిలిపివేత
వినియోగదారుల చట్టం లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్తే అమ్మకందారుల్లో బాధ్యత పెరుగుతుందన్నారు. 75 లక్షల మందికి దీపం పథకం కింద ఇప్పటి వరకు సిలిండర్లు ఇచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రతి సంస్థ బాధ్యత తీసుకోవాలన్నారు. నమ్మకం కలిగేలా సేవలు, నాణ్యత, కొలతల్లో ఉంటే రిపీట్ కష్టమర్లుగా మారతారన్నారు. నమ్మకం కోల్పోతే ప్రతి సందర్భంలో విమర్శిస్తారన్నారు. తూనికలు కొలతల శాఖ ఇంకా పటిష్ఠం కావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం చేస్తున్న ఆకస్మిక తనిఖీలు సరిపోవు, ఇవి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కస్టమర్ అనే వ్యక్తి లేకపోతే ఏ వ్యాపారం ఉండదు అనేది తెలుసుకోవాలన్నారు. సాధ్యంకాని మిస్ లీడింగ్ ప్రకటనలు వ్యాపార సంస్థలు చేస్తున్నాయని మండిపడ్డారు. వ్యాపారం పెంచుకోవటం కోసం ఇవన్నీ చేస్తున్నాయన్నారు. ఫుడ్ కల్తీ అనేది సీరియస్ విషయంగా గుర్తించామన్నారు. ప్రతి జిల్లాలో ఒక ల్యాబ్ ఏర్పాటు చేయాలని సీఎంను కోరతామని చెప్పారు. ప్రొడక్ట్ నాణ్యత, సేవలలో తప్పులు ఉంటే సోషల్ మీడియాలో ప్రజల్లోకి యువత తీసుకు వెళ్ళాలన్నారు. బలమైన చట్టాలను ప్రజలు వినియోగించు కోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.