NTV Telugu Site icon

Minister Nadendla Manohar: రైస్‌ మిల్లులలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు

Minister Nadendla Manohar

Minister Nadendla Manohar

Minister Nadendla Manohar: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పలు రైస్‌ మిల్లులలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సత్తెనపల్లిలో అనేక మిల్లులో పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నామని మంత్రి వెల్లడించారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని ఇలా పక్కదారి పట్టించడం దారుణమన్నారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కొక్క కేజీని రాష్ట్ర ప్రభుత్వం 40 రూపాయలకు పైగా సొమ్ము చెల్లించి కొంటుందన్నారు.

Read Also: Minister Satya Kumar Yadav: రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షలు.. 4 కోట్ల మందికి టెస్టులు

అలాంటి బియ్యాన్ని పేదలకు సబ్సిడీ రూపంలో, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయన్నారు. ప్రాథమికంగా 1000 మెట్రిక్ టన్నులు, పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశామని వెల్లడించారు. పూర్తిస్థాయిలో విచారించిన తర్వాత మరిన్ని వివరాలు చెప్తామన్నారు. రాష్ట్రంలో కోటి 55 లక్షల గ్యాస్ కనెక్షన్లలో అర్హులైన వారికి దీపం పథకం ద్వారా , ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పై ప్రతిపక్ష పార్టీలు ,సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అనవసరమైన దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Show comments