శ్రీశైలంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఏపీ గురించి మాట్లాడేటప్పుడు ముందు హైదరాబాద్ లో నాలాల్లో పిల్లలు కొట్టుకుపోతున్నారు అది చూడండి అని సెటైర్ వేశారు. తెలంగాణలో రాజకీయాలకు ఉపయోగపడితే మాట్లాడుకోండి మా నాయకుడు అటు కన్నెత్తి కూడా చూడరు అంటూ మంత్రి మండిపడ్డారు.
Read Also: Hashmatullah Shahidi: భారత అభిమానుల వల్లే ఈ విజయాలు.. రుణపడి ఉంటాం: అఫ్గాన్ కెప్టెన్
ఇక, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు NCR రిపోర్టులో దళితుల మీద దాడులు అఘాయిత్యాలలో ఏపీ మూడో స్థానంలో ఉంది అని దేశం మొత్తం కోడైకూసింది అని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఇప్పుడు చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులు, అవగాహన, ఆలోచన లేని వాళ్ళు చర్చ గోస్ట్ అని పెట్టి జగన్ దళితుల మీద జరుగుతున్న దాడులను పట్టించుకో లేదంటు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను పట్టించుకోలేదని జగన్ పై విమర్శించిన వాళ్ళకు చంద్రబాబుతో సహా ఎవరైనా బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ మంత్రి సవాల్ విసిరారు.
వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు విశేషంగా జనాల్లో కదలిక జగన్ బొమ్మ పెట్టి తిరుగుతుంటే జనం చర్చించుకుంటున్నారు అని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది సీఎం అవ్వాలని చంద్రబాబు జైలుకు వెళ్ళగానే లోపలికి వెళ్లి బయటకు వచ్చి కలిసి పోటీ అంటారు.. దీన్ని ప్రజలు గమనించండి అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల సీఎంగా ఎర్ర యాగాడైనా ఇచ్చాడు తుఫాను ఆపాను కంప్యూటర్ తెచ్చాను అని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతాడు.. 2014లో చంద్రబాబుకి మద్దతిచ్చిన ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు, టీడీపీ పార్టీని బహిరంగంగా తిట్టి ఆరబోశారు అని మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు.