NTV Telugu Site icon

Merugu Nagarjuna: చంద్రబాబు హయాంలో దళితులపై జరిగిన దాడులు దేశంలో ఎక్కడా జరిగి ఉండవు..

Minister Merugu Nagarjuna

Minister Merugu Nagarjuna

Merugu Nagarjuna: చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో దళితులపై జరిగిన దాడులు దేశంలో ఎక్కడా జరిగి ఉండవని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. బీసీలపై పడి వారిని భయబ్రాంతులను చేసిన పరిస్థితి ఆ సమయంలో నెలకొందన్నారు. బీసీలను బాక్ వర్డ్‌గానే చంద్రబాబు చూశారని.. బీసీలను బాక్ బోన్‌లా సీఎం జగన్ కాపాడుతున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు, పవన్‌లు బీజేపీతో కలిసి ఎన్నికలకు వస్తున్నారని ఆయన అన్నారు. ఆ రోజు ఎందుకు దూరంగా వెళ్లారో.. ఈరోజు చంద్రబాబుకు పవన్ ఎందుకు కలిసారో చెప్పాలన్నారు. బీసీ, ఎస్సీ, మైనారిటీలను సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారన్నారు.

Read Also: Andhrapradesh: అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం చర్యలు.. టెర్మినేషన్‌ ఆర్డర్లు సిద్ధం!

గత ప్రభుత్వాలు బీసీలు, ఎస్సీ లను మోసం చేశాయని బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సీఎం జగన్ అండగా ఉన్నారని వెల్లడించారు. ఎన్టీఆర్, వైఎస్సార్ తర్వాత బీసీలకు అండగా జగన్ నిలిచారన్నారు. కొన్ని సామాజిక వర్గాలనే చంద్రబాబు అందలం ఎక్కించారని తీవ్రంగా మండిపడ్డారు. బాపట్ల ఎంపీగా అవకాశం వచ్చినా రాకపోయినా.. సీటు కోసం కాదు జగనన్న మనసులో చోటు కోసం పనిచేస్తానన్నారు. వచ్చే 25 ఏళ్లు సీఎంగా జగనన్నే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. ప్రజల ఆశీస్సులు జగనన్నకు ఎప్పుడు ఉంటాయన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలవని నారా లోకేష్‌ను తీసుకువచ్చి మూడు శాఖల మంత్రిగా చేసిన చంద్రబాబు.. మనుషులను వాడుకుని వదిలేయటంలో చంద్రబాబు కన్నా లోకేష్ మరీ ఎక్కువ దిట్ట అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.

Show comments