Site icon NTV Telugu

Merugu Nagarjuna: పార్టీ లైన్‌ దాటితే ఎవరికైనా అటువంటి పరిస్థితి తప్పదు..

Merugu Nagarjuna

Merugu Nagarjuna

Merugu Nagarjuna: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారో తమకు తెలుసునని మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. అందుకే వారిని పార్టీ నుంచి బహిష్కరించామన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆమెనే చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ వల్లే ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా గెలుపొందారన్నారు. శ్రీదేవి ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితి స్వయంకృతాపరాధమని ఆయన పేర్కొన్నారు. ఎవరి రక్తం బొట్టుతో గెలిచావో.. ఎందుకు పార్టీకి నష్టం చేశారో గుర్తించాలన్నారు. పార్టీ లైన్‌ దాటితే ఎవరికైనా అటువంటి పరిస్థితి తప్పదని మంత్రి అన్నారు. ఆమెకు వైసీపీ సానుభూతిపరులు వెహికల్ కూడా ఇచ్చారన్నారు. ఎమ్మెల్యే పార్టీ లైన్ దాటడంతో వెహికల్ తీసుకున్నారని.. ఇందులో దౌర్జన్యం ఏమీ లేదన్నారు. ఎమ్మెల్యేకు ఇచ్చిన కారును దాని యజమాని తీసుకుని వెళ్ళిపోతే తప్పేంటన్నారు.

Read Also: Police Station Robbery: ఇదేందయ్యా ఇది.. పోలీస్‌స్టేషన్‌లోనే దోపిడీ.. విలువైన వెండి ఆభరణాలు మాయం

సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యలు చూస్తుంటే విడ్డురంగా ఉందని మెరుగు నాగార్జున అన్నారు. కమ్యూనిస్టులు చంద్రబాబుకు పార్టీని తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. ఎన్నికలప్పుడు ఒకటి రెండు టిక్కెట్ల కోసం వెంపర్లాడే మీరా… ప్రభుత్వం గురించి మాట్లాడేదంటూ సీపీఐ నేత నారాయణపై మండిపడ్డారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడికి జనం ముందుకు వెళ్లి ఓటు అడిగే అర్హత లేదన్నారు.

Exit mobile version