Minister Meruga Nagarjuna: జగన్ ప్రభుత్వంలో దళితుల తలరాతలు మారాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Meruga Nagarjuna: పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్య అందిస్తుంటే చంద్రబాబుకు కనిపించటం లేదని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఏదో విధంగా ఎస్సీలను మోసం చేయాలనే దుష్ట ఆలోచన చంద్రబాబుది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే అన్ని వర్గాలను మోసం చేశాడని.. చంద్రబాబు హయాంలో దళితులు అలో లక్ష్మణ అంటూ బతికారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో దళితుల తలరాతలు మారాయని.. గౌరవంతో బతుకుతున్నామని వారు అంటున్నారని మంత్రి తెలిపారు. దళిత క్రైస్తవులు చంద్రబాబుకు కనిపించారా అంటూ ప్రశ్నించారు.
Read Also: AP Land Registrations: ఏపీవ్యాప్తంగా నిలిచిన భూముల రిజిస్ట్రేషన్లు
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
దళిత క్రైస్తవులను దళితులకు అందే హక్కులు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసిన నాయకుడు జగన్ అంటూ మంత్రి తెలిపారు. రాజధాని ప్రాంతంలో పేదవారికి ఇళ్ళ స్థలాలు ఇస్తే అడ్డుకున్నది ఎవరంటూ మంత్రి ప్రశ్నించారు. పేదవారికి ఇళ్ళ స్థలాలు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇన్బాలెన్స్ వస్తుందని చంద్రబాబు కోర్టుకు ఎక్కలేదా అంటూ ప్రశ్నలు గుప్పించారు. అంబేద్కర్ భావజాలాన్ని అణగదొక్కాలని చూసింది చంద్రబాబు అంటూ ఆరోపించారు. ప్రపంచం గర్వించే విధంగా విజయవాడలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు సీఎం జగన్ అని మంత్రి వెల్లడించారు.
చంద్రబాబు హయాంలో జరిగిన కారంచేడు, నీరుకొండ ఘటనలను ప్రజలు మర్చిపోలేదన్నారు. చంద్రబాబు హయాంలో దళితుల మీద దాడుల్లో రాష్ట్రం దేశంలోనే నాల్గవ స్థానంలో ఉండేదని.. జగన్ సామాజిక సాధికారతకు ప్రయత్నం చేస్తుంటే కనిపించటం లేదా అంటూ ప్రశ్నించారు. పేద వాళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయటం చంద్రబాబు మానాలని హితవు పలికారు. దళితులకు మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై ఎవరు చర్చకు వచ్చినా సిద్ధమని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!