సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో నూతనంగా ఏర్పడిన సురారం పోలీస్ స్టేషన్ ను ముఖ్య అతిథులుగా వచ్చిన మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే వివేకానంద, మేడ్చల్ డీసీపీ సందీప్ రావు పాల్గొన్నారు. ఈ ప్రొగ్రాంలో ఏసీపీలు,సీఐలు, కార్పోరేటర్లు పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడల్చ్ లో కొత్తగా 9 పోలీస్ స్టేషన్ లు.. 2 డీసీపీ ఆఫీస్ లు.. 3 ఏసీపీ ఆఫీస్ లు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, హోంమంత్రి మహ్మద్ ఆలీకి ధన్యవాదాలు అని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
Also Read : Odisha train accident: “నా బాధ్యత ముగియలేదు”.. ఎమోషనల్ అయిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్..
తెలంగాణ ఏర్పాడక ముందు కేవలం రాష్ట్రంలో 60-70 పోలీస్ స్టేషన్ లు మాత్రమే ఉన్నాయి.. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా 70 పీఎస్ లను ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని ఆయన అన్నారు. ఈ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా మనం ఈ పోలీస్ స్టేషన్ లను ప్రారంభించుకుంటున్నామన్నారు. నిన్న కేబుల్ బ్రిడ్జ్ మీద 500 డ్రోన్ కెమెరాలతో లేజర్ షో అద్భుతంగా నిర్వహించాము.. భారతదేశంలోనే అరుదైన ఘనత అది అని మల్లారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో క్రైం రేట్ తగ్గించేందుకే నూతన పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్రైం జరిగిన వెంటనే గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకునే వ్యవస్థ మన దగ్గర ఉండటం వల్లే వరుస పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు.
Also Read : Madhya Pradesh: మొన్న బీహార్లో నేడు ఎంపీలో.. వరుడు నల్లగా ఉన్నాడని పరారైన పెళ్లికూతురు
ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. సురారం పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో ఈ పరిధిలో పూర్తిగా క్రైం రేట్ ను కంట్రోల్ చేసి నేర నియంత్రణలో పోలీస్ వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని సైబరాబాద్ లోనే ఈ పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎదగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరిపాలన సౌలభ్యం కోసం కొత్త పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేసుకుంటున్నామని ఆయన అన్నారు. తెలంగాణ పోలీసులు శాంతిభద్రతలు రక్షించడంలో దేశంలోనే టాప్ లో ఉన్నారు అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అన్నారు.