NTV Telugu Site icon

Minister MallaReddy: మా మ్యానిఫెస్టో అద్భుతంగా ఉంటుంది.. కేసీఆర్ పులి.. ఎవరికి భయపడే వ్యక్తి కాదు..

Mallareddy

Mallareddy

మా మ్యానిఫెస్టో అద్భుతంగా ఉంటుంది అని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల టైంలో విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని మంత్రి అన్నారు. కాంగ్రెస్ నేతలకు ఫెస్ వ్యాల్యూ లేదని.. సీఎం కేసీఆర్ ఎవరికి భయపడే వ్యక్తి కాదు.. కేసీఆర్ పులి అంటూ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అఖండ విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా, ఇప్పటికే 115 మంది అభ్యర్థులని బీఆర్ఎస్ ప్రకటించింది. అయితే, మల్కాజిగిరి అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో.. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి బీఆర్ఎస్ తరపున టికెట్ ఇచ్చే అవకాశం ఉంది.

Read Also: Rizwan-Kohli: మహ్మద్‌ రిజ్వాన్ అతి తెలివితేటలు.. ఫ్ట్రస్ట్రేట్ అయిన విరాట్ కోహ్లీ!

ఈ నేపథ్యంలో మల్కాజిగిరితో పాటు గతంలో ప్రకటించని జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి అభ్యర్థులకు నేడు సీఎం కేసీఆర్ బీ-ఫారాలు ఇవ్వనున్నారు. మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్‌రెడ్డి, జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్‌లో సునీత లక్ష్మారెడ్డి పేర్లు ఖరారు అయ్యాయి. అయితే, గతంలో ప్రకటించిన 114 మంది అభ్యర్థుల్లో ఇద్దరు, ముగ్గురిని మార్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుంది. ఇక, తెలంగాణ భవన్ దగ్గర, గెల్లు శ్రీనివాస్ యాదవ్, మర్రి రాజశేఖర్ రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మంత్రి మల్లారెడ్డి కలుగజేసుకుని రాజశేఖర్ రెడ్డిని తెలంగాణ భవన్ లోకి తీసుకువెళ్లారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ అక్కడి నుంచి వెనుదిరిగిపోయారు.