Minister MallaReddy: మా మ్యానిఫెస్టో అద్భుతంగా ఉంటుంది.. కేసీఆర్ పులి.. ఎవరికి భయపడే వ్యక్తి కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మా మ్యానిఫెస్టో అద్భుతంగా ఉంటుంది అని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల టైంలో విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని మంత్రి అన్నారు. కాంగ్రెస్ నేతలకు ఫెస్ వ్యాల్యూ లేదని.. సీఎం కేసీఆర్ ఎవరికి భయపడే వ్యక్తి కాదు.. కేసీఆర్ పులి అంటూ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అఖండ విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా, ఇప్పటికే 115 మంది అభ్యర్థులని బీఆర్ఎస్ ప్రకటించింది. అయితే, మల్కాజిగిరి అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో.. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి బీఆర్ఎస్ తరపున టికెట్ ఇచ్చే అవకాశం ఉంది.
Read Also: Rizwan-Kohli: మహ్మద్ రిజ్వాన్ అతి తెలివితేటలు.. ఫ్ట్రస్ట్రేట్ అయిన విరాట్ కోహ్లీ!
Also Read
ఈ నేపథ్యంలో మల్కాజిగిరితో పాటు గతంలో ప్రకటించని జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి అభ్యర్థులకు నేడు సీఎం కేసీఆర్ బీ-ఫారాలు ఇవ్వనున్నారు. మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్‌రెడ్డి, జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్‌లో సునీత లక్ష్మారెడ్డి పేర్లు ఖరారు అయ్యాయి. అయితే, గతంలో ప్రకటించిన 114 మంది అభ్యర్థుల్లో ఇద్దరు, ముగ్గురిని మార్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుంది. ఇక, తెలంగాణ భవన్ దగ్గర, గెల్లు శ్రీనివాస్ యాదవ్, మర్రి రాజశేఖర్ రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మంత్రి మల్లారెడ్డి కలుగజేసుకుని రాజశేఖర్ రెడ్డిని తెలంగాణ భవన్ లోకి తీసుకువెళ్లారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ అక్కడి నుంచి వెనుదిరిగిపోయారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!