కొమురం భీం జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ ఓ మోడల్ రాష్ట్రమని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దూసుకు పోతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. 12వేల 869 గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మల్లారెడ్డి కొనియాడారు. 24గంటల నిరంతర విద్యుత్ అందించిన సీఎం దేశంలో లేడన్న మంత్రి మల్లారెడ్డి.. ఒక్క సీఎం కేసీఆర్ కే సాధ్యం అయ్యిందన్నారు. కార్పొరేట్ విద్యా అందిస్తూ వైద్యం కొసం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఆయన అన్నారు.
Also Read : New Rules From October: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
అంతేకాకుండా.. గత ప్రభుత్వాలు మన ఓట్లు వేసుకుని పదవులు అనుభవించారు తప్ప చేసిన అభివృద్ది శూన్యమని మండిపడ్డారు. గత పాలకుల హాయంలో చెరువులు ఎండిపోయాయని, నేడు 46 వేల చెరువులు జలకలను సంతరించుకున్నాయని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ దరిద్రపు పార్టీ వారి కాలంలో వర్షాలు కూడ పడలేదని విమర్శించారు. కేసీఆర్ సీఎం అయ్యాక వద్దంటే వర్షాలు కురుస్తున్నాయంటూ ఆయన కితాబిచ్చారు. నేనే మొన్న వర్షాలు తగ్గాలంటూ దేవుడిని మొక్కిన అని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ఓ దొంగ అయితే బీజేపీ బట్టే బాజ్ పార్టీ ఈ రెండు పార్టీలకు ఓటు వేయకుండా జాగ్రత్త పడాలని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో చేసిన అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాల్లో కూడా బీఅర్ ఎస్ పార్టీ రావాలి ఇదే రీతిలో అభివృద్ది జరగాలని కోరుకుంటున్నారన్నారు.
Also Read : Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ మౌనం.. టీడీపీ సంచలన వ్యాఖ్యలు..