NTV Telugu Site icon

Minister Malla Reddy : ఈ సారి రెండు లక్షల మెజార్టీతో గెలుస్తా..

Malla Reddy

Malla Reddy

మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేడ్చల్ మున్సిపాలిటీలో మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నేడు కొనసాగింది. నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. మల్లారెడ్డికి గజ మాలతో ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. అయితే.. ఈ సందర్భంగా ఎన్టీవీ తో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఊహించని రీతిలో జనాలు వస్తున్నారని, ఈ సారి రెండు లక్షల మెజార్టీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను గెలిపిస్తానని, నన్ను విమర్శించే హక్కు ఎవ్వరికీ లేదన్నారు మల్లారెడ్డి. నేను ఫ్రీగా ట్రీట్మెంట్ చేపిస్తున్న.. నా సొంత డబ్బుతో ప్రజలకు సేవ చేస్తున్న అని ఆయన అన్నారు.

Also Read : IND vs ENG Dream11 Prediction: భారత్ vs ఇంగ్లండ్ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!

నేను వరల్డ్ ఫేమస్.. సోషల్ మీడియా స్టార్ నేను అని మల్లారెడ్డి అన్నారు. పాలమ్మిన పూలమ్మిన ఈ స్థాయికి వచ్చానని, మీలాగా భూకబ్జాలు చేసి ఎదగలేదంటూ విపక్షాలపై విమర్శలు చేశారు. కబ్జాదారులను అందరిని జైలుకు పంపిస్తా.. పీడీ యాక్ట్ పెడుతామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఎవరో నా నియోజకవర్గంలోని నాలుగు లక్షల మందికి తెలీదని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. నిన్న మేడ్చల్‌లోని ఓ కాలనీలో ప్రచారం చేసిన మల్లారెడ్డి షేర్ బ్యాండ్‌తో తనదైన శైలిలో ప్రచారం చేశారు. హైదరాబాద్‌లో ఫేమస్ అయిన.. షేర్ బ్యాండ్ డైలాగ్‌లోతో హుషారెత్తించారు. అప్పుడెట్లుండే తెలంగాణా… అప్పుడెంట్లుండే తెలంగాణా.. ఇప్పుడెట్లుంది తెలంగాణ’ అంటూ షేర్ బ్యాండ్ మ్యూజిక్‌తో డైలాగ్‌లు విసిరి ఆకట్టుకున్నారు. తీన్నార్ స్టెప్పులతో కార్యకర్తల్లో జోష్ నింపారు.

Also Read : Mukesh Ambani: నేడు మరోసారి ముఖేష్ అంబానీకి హత్య బెదిరింపు.. ఈ సారి ఏకంగా రూ.200కోట్లు డిమాండ్