NTV Telugu Site icon

IT Tower: రేపు నిజామాబాద్ లో ఐటీ టవర్ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

It Tower

It Tower

తెలంగాణ రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం మరో ముందడుగు వేస్తున్నది. ఇప్పటికే కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేటలో ఐటీ హబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కార్‌.. తాజాగా నిజామాబాద్‌ ఐటీ టవర్‌ ప్రారంభానికి సిద్ధం చేసింది. ఇందూరు ఐటీ టవర్‌ను మంత్రి కేటీఆర్‌ బుధవారం ఓపెనింగ్ చేయనున్నారు. ఈమేరకు మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

Read Also: Evil Eye Remedy: నరదిష్టి ఇబ్బందిపెడుతుందా.. తాంత్రికుడి సాయం లేకుండా ఇలా చేయండి

టైర్‌ 2 పట్టణాలు, నగరాలకు ఐటీ సెక్టార్‌లో విస్తరించడంలో భాగంగా నిజామాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ హబ్‌ను ప్రారంభిస్తున్నాట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. యువత తమ నైపుణ్యాలు పెంచుకోవడానికి, సరికొత్త ఆవిష్కరణల కోసం ఇందులో టీ-హబ్‌, టాస్క్‌ సెంటర్లు కూడా ఉన్నాయి.. దీని ద్వారా తెలంగాణ అభివృద్ధిలో యువత పాలుపంచుకునే అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు.

Read Also: Chardham Yatra: చార్ ధామ్ టూర్ లో యాత్రికుల ఇబ్బందులు

టాస్క్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, అందులో భాగంగా నిజామాబాద్‌లో ప్రతి నెలా ఒక జాబ్ మేళా ఉండేలా చూస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ నెల 29న మరో జాబ్ మేళా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అమెజాన్, హెచ్‌డీఎఫ్‌సీ, గూగుల్, టెక్ మహీంద్రా, ఐబీఎం వంటి 52 అంతర్జాతీయ కంపెనీలు మేళాకు వస్తున్నాయని.. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు.

Read Also: Suicide Attempt: నిన్న ప్రియుడు, నేడు ప్రియురాలు ఆత్మహత్యయత్నం..

అయితే, 750 మంది పని చేసే సామర్థ్యంతో ఈ భవనాన్ని నిర్మించారని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. ఇక్కడి నుంచి పని చేయడానికి ఇప్పటికే 15 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇటీవల జిల్లాలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో 280 మందికి ఆయా కంపెనీలు ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చాయని పేర్కొన్నారు. ఇప్పటికే 200 మంది ఉద్యోగాల్లో చేరేందుకు రెడీగా ఉన్నారని ఎమ్మెల్యే కవిత అన్నారు.

Show comments