Site icon NTV Telugu

Minister KTR : నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

Ktr

Ktr

రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజీవ్‌నగర్‌ శివారులోని మినీస్టేడియంలో ఉదయం 11 గంటలకు పోలీస్‌ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరు కానున్నారు. అనంతరం మహిళల సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన యాప్‌తోపాటు మానసిక ఆరోగ్య సేవల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ప్రారంభించనున్నారు. మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read : Lorry Bandh: ఏపీలో రేపు లారీల బంద్‌.. విషయం ఇదే..

ఇదిలా ఉంటే.. ఈ నెల 5న మంత్రి కేటీఆర్‌ హ‌న్మకొండలో ప‌ర్యటించనున్నారు. సుమారు రూ.150 కోట్ల విలువైన పలు పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, సైన్స్ పార్కును మంత్రి ప్రారంభించనున్నారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కాజీపేటలోని సెయింట్ గాబ్రియేల్ స్కూల్ గ్రౌండ్స్ లో మే 5న జరిగే కేటీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను చీఫ్ విప్ డీ.వినయ్ భాస్కర్ ప‌రిశీలించారు.

Also Read : Telangana Congress : ఈ నెల 8న తెలంగాణకు ప్రియాంక గాంధీ.. నేడు పార్టీ ముఖ్యులతో థాక్రే సమావేశం

Exit mobile version