NTV Telugu Site icon

Minister KTR : నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్‌ పర్యటన

Minister Ktr

Minister Ktr

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. సిరిసిల్లా జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం, పదిరలో దళిత బంధు పథకంలో భాగంగా మంజూరైన రైస్ మిల్‎ని ఉదయం 11 గంటలకు మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్య నగర్‎లో నూతనంగా నిర్మించిన హిమాన్షి పిల్లల హాస్పిటల్‎ని ప్రారంభిస్తారు మంత్రి కేటీఆర్‌.

Also Read : Bilkis Bano rapist: గుజరాత్ ప్రభుత్వ కార్యక్రమం.. వేదికపై బీజేపీ నేతలతో బిల్కిస్ బానో రేపిస్ట్

ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 2 గంటల వరకు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని, కార్యకర్తలతో కలిసి అక్కడే భోజనం చేస్తారు. తిరిగి సాయంత్రం 3 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ పంచాయతీ ఆవార్డుల కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 27 గ్రామ పంచాయతీలకు అవార్డులను మంత్రి కేటీఆర్‌ ప్రదానం చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పలు విభాగాల్లో జిల్లా స్థాయిలో పలు గ్రామాలు అవార్డులకు ఎంపికయ్యాయి.

Also Read : IPL 2023 : జడేజా, బెన్ స్టోక్స్ ఫోటో వైరల్.. రొనాల్డో- మెస్సీతో పోల్చుతున్న నెటిజన్స్..

పేదరిక నిర్మూలన, జీవనోపాధి పెంపు, ఆరోగ్య పంచాయతీ, పిల్లల స్నేహపూర్వక పంచాయతీ, నీటి సమృద్ధిగల పంచాయతీ, పరిశుభ్రత, పచ్చదనం, స్వయం సమృద్ధి వసతులు, సాంఘిక భద్రత, సుపరిపాలన, మహిళా స్నేహపూర్వక వంటి 9 అంశాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి అవార్డులకు 27 గ్రామ పంచాయతీలు ఎంపికయ్యాయి. నేడు మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా కలెక్టర్‌ కార్యాలయంలో సర్పంచులు అవార్డులు అందుకోనున్నారు.