NTV Telugu Site icon

Minister KTR : ఆత్మహత్యల నుంచి దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ

Ktr Fire On Singareni Priva

Ktr Fire On Singareni Priva

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా లక్షన్నర మంది రైతులతో మంత్రి కేటీఆర్ సంభాషించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతులతో టెలి కాన్ఫరెన్స్  ద్వారా మాట్లాడిన కేటీఆర్.. రైతన్నల సమగ్ర సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతేకాకుండా.. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర వ్యవసాయ ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయిందని, కరువు నేలలను హరిత నేలలుగా మార్చామన్నారు. కటిక చీకట్ల తొలగిపోయి 24 గంటల కరెంటు వెలుగులు కనిపిస్తున్నాయని, ఆత్మహత్యలు నుంచి దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ మారిందన్నారు.
Also Read : Off The Record: క్రమశిక్షణా సంఘం నేతకే అసమ్మతి సెగ
దేశ చరిత్రలో ఎవరూ ఊహించని రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి విప్లవాత్మక పథకాలను కేసీఆర్ ప్రవేశపెట్టారని, రైతు సంక్షేమానికి వ్యవసాయ రంగ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. ప్రతీసారి రైతన్నలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నిలబడ్డారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. భవిష్యత్తులోనూ రైతన్నల ఇలానే మద్దతుగా ఉంటారన్న  విశ్వాసం వ్యక్తం చేసిన కేటీఆర్.. రైతన్నల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : Team India: టీమిండియా సెలక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న సచిన్, సెహ్వాగ్.. అసలు విషయం ఇదే..!!