NTV Telugu Site icon

Minister KTR: రైతుల వెన్నంటే ఉండాలి.. వారికి భరోసా కల్పించాలి

Ktr

Ktr

Minister KTR: అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న రైతులకు వెన్నంటే ఉండాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ సూచించారు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. నష్టానికి గురైన వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లాలని వారితో అన్నారు. ప్రస్తుతం ఉన్న ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న రైతులకు వారికి భరోసా ఇచ్చి వారిలో విశ్వాసం కల్పించేలా వారితో మమేకం కావాలన్నారు. దీంతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం వేగంగా చేపడుతున్న కార్యక్రమాలను పార్టీ ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలన్నారు.

సీఎం కేసీఆర్ సూచన మేరకు పంచాయతీరాజ్ రోడ్ల బలోపేతం అంశం పైన దృష్టి సారించి.. వర్షాకాలం లోపల పనులు పూర్తయ్యేలా చూడాలని మంత్రి కేటీఆర్ అధికారులు, ప్రజా ప్రతినిధులను ఆదేశించారు. ఉపాధి హామీ, పట్టణ, పల్లె ప్రగతి వంటి అభివృద్ధి కార్యక్రమాల బిల్లుల చెల్లింపు పై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి హామీకి సంబంధించిన రూ.1300 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా ఇంకా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో బిల్లుల చెల్లింపు ఆలస్యమైందన్నారు. వచ్చేనెల 29 నాటికి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు పూర్తి కావాలని.. ఇందుకు సంబంధించి, ఇప్పటికే జిల్లా ఇన్ చార్జులుగా వెళ్లిన వారి ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయన్నారు.

Read Also: Aishwarya Rajinikanth: ధనుష్ మాజీభార్య ఇంట్లో దొంగతనం.. లక్షల్లో నగదు మాయం

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా కార్యకర్తలకు ప్రత్యేకంగా ఇస్తున్న సందేశాన్ని అన్ని ఆత్మీయ సమ్మేళనాల్లో చదివి వినిపించాలన్నారు. నాలుగైదు డివిజన్లకు కలిపి ఒక ఆత్మీయ సమ్మేళనాలని ఏర్పాటు చేసుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. సమావేశాల్లో పార్టీ శ్రేణుల ప్రాధాన్యత తెలంగాణ ప్రగతి ప్రస్థానం, తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు, వచ్చిన తర్వాత మారిన తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రం వంటి అంశాలను స్పృశించుకుంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రతీ కార్యకర్తకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. ముఖ్యంగా మోడీ ప్రభుత్వ హయాంలో పెరిగిన పెట్రోల్, నిత్యవసర సరుకుల ధరలు, మోడీ ప్రభుత్వ విధానాల వైఫల్యాలు వంటి వాటిని కార్యకర్తలకు అర్థమయ్యేలా చర్చించి, ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అలాగే రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను మహిళా లోకానికి చేరేలా చూడాలని మంత్రి సూచించారు.

Read Also: Theft : సొంతింట్లోనే దొంగతనం చేసిన కూతురు

రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆత్మీయ సమ్మేళనాలకు రాష్ట్రస్థాయి నాయకులు, పార్టీ నేతలు ప్రత్యేక అతిథులుగా హాజరవుతారు. ఏప్రిల్ 20వ తేదీ నాటికి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేసుకుంటే ఏప్రిల్ 25వ తేదీన నియోజకవర్గస్థాయిలో పార్టీ ప్రతినిధుల సమావేశం నిర్వహించుకోబోతున్నామని కేటీఆర్ ప్రకటించారు. ఒక్కో పార్టీ ప్రతినిధుల సమావేశంలో 1000 నుంచి 1500 మంది పార్టీ ప్రతినిధులతో ఈ సమావేశాలు ఉండనున్నాయన్నారు. ఏప్రిల్ 27వ తేదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో జెండా పండుగ కార్యక్రమం ఉంటుందన్నారు. ఏప్రిల్ 27వ తేదీన పార్టీ ప్లీనరీ జరుగుతుంది. దీనికి పార్టీ ఆహ్వానించిన ప్రతినిధులు మాత్రమే హాజరవుతారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Show comments