NTV Telugu Site icon

Minister KTR : 9 ఏళ్ళు అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల్లా తీసుకెళ్తున్నాం

Minister Ktr Speech

Minister Ktr Speech

వరంగల్ జిల్లా కాజీపేటలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 9 ఏళ్ళు అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల్లా తీసుకెళ్తున్నామన్నారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ బీజేపీ నాయకులు సంక్రాంతి కి గంగిరెద్దుల మాదిరిగా వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కల్లబోల్లి మాటలు చెప్పే పార్టీలను నమ్మి మోసపోకుండా వినయ్ భాస్కర్ ను 70 వేల మెజార్టీతో గెలిపించాలన్నారు. అంతేకాకుండా.. ‘దుర్మార్గుడు చిల్లరగాడు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు పదోతరగతి పేపర్ లీక్ చేశాడు. దిక్కుమాలిన బిజేపి నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశంతో పేపర్ లీక్ చేశాడు. పోలీసులు పట్టుకుని జైల్ కు పంపితే బెయిల్ పై బయటకు వేస్తే దండలువేసి శాలువాలు కప్పి సన్మానించిన నీచమైన పార్టీ బీజేపీ. ఇంకా కుట్రలు జరుగుతాయి… మతం పేరిట చిచ్చు పెడుతారు. చైతన్యానికి మారుపేరుగా నిలిచే ఓరుగల్లు ప్రజలు ఆలోచించాలి.

Also Read : Populated Cities: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా గల టాప్-10 నగరాలు

రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అమలు చేయలేని సిగ్గుమాలిన దరిద్రపు పార్టీ బీజేపీ. తెలంగాణ ను ఏదో ఉద్దరించినట్లు నిరుద్యోగ సభలు పెడుతున్నారు. 640 కోట్లతో గ్రేటర్ వరంగల్ లో మంచినీటి సౌకర్యం కల్పించాం. 1100 కోట్లతో హెల్త్ సిటీని నిర్మిస్తున్నాం. బీజేపీకి నియ్యతి ఉంటే వరంగల్ కు ఏం చేశారో చెప్పాలి. మోడీ దోస్త్ కు దోచిపెట్టాలి.. దోస్త్ ఇచ్చే కమీషన్ తో దందాలు చేయాలే. మతం పేరిట మంటలు పెట్టుడే తప్ప ఒక్క మంచిపని చేసిందా బీజేపీ. నిరుద్యోగ యువత ఆలోచించాలి… మోడీ ప్రకటించిన ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి. వరంగల్ అంటే వారసత్వ సంపదే కాదు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఐటికి సంబంధించిన 8 నుంచి పది కంపెనీలు వరంగల్ కు వచ్చాయి. ముంబాయి కి పూణేలా… హైదరాబాద్ కు వరంగల్ మారుతుంది. తెలంగాణ కు వరంగల్ మణిహారం గా మారబోతుంది. తెలంగాణ లో పేదల ప్రభుత్వం ఉంది. అన్ని రాష్ట్రాలకు సీఎం ఉంటారు… కానీ మనకు రాష్ట్రాన్ని తెచ్చిన సీఎం ఉన్నారు.’ అని ఆయన మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Also Read : SK21: ఎన్నా .. తలైవా.. ఏమన్నా కాంబినేషనా

Show comments