NTV Telugu Site icon

Minister KTR : బండి సంజయ్‌కి కేటీఆర్‌ సవాల్‌.. మసీదులు కాదు.. దమ్ముంటే కాలువలు తవ్వుదాం రా

Minister Ktr

Minister Ktr

జమ్మికుంటలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఈ 14 నెలల్లో కేంద్రం నుంచి ఈటల ఒక్క రూపాయి అయినా తెచ్చారా?అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌కు రాజకీయ జన్మనిచ్చింది సీఎం కేసీఆరే అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఈ సభ చూస్తే హుజురాబాద్ గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందన్న నమ్మకం కలుగుతోందని, 14నెలల కింద జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల మాటలు నమ్మి గెలిపించారన్నారు. 14 నెలల్లో ఢిల్లీ నుంచి ఒక్క పైసా అయినా ఢిల్లీ నుంచి వచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. శుష్క ప్రియాలు.. శూన్య హస్తాలు వారివి అని ఆయన మండిపడ్డారు. ఈటల రాజేందర్ అనే వ్యక్తికి ఎంతో మందిని కాదని టిక్కెట్‌ విషయం మార్చిపోయిండా.. అలాంటి తండ్రి నాయకున్ని పట్టుకుని కేసీఆర్ పాలన అరిష్టమని ఈటల అంటున్నడు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి పాలన అరిష్ఠమో అందరికీ తెలుసునని, జనధన్ ఖాతాలా ధనాధన్ 15 లక్షలన్నడు.అవన్నీ ఒకే ఒక్కరి ఖాతాలో పడటంతో ప్రపంచ ధనవంతుడయ్యాడని ఆయన ధ్వజమెత్తారు.

Also Read : Air India Urination Case: కో పాసింజర్‌పై మూత్ర విసర్జన కేసులో శంకర్ మిశ్రాకు బెయిల్

మోడీ దేవుడట.. ఎవనికి దేవుడు? 400 సిలిండర్ 12వందలు చేసినందుకు, 2 కోట్ల ఉద్యోగాలని మోసం చేసినందుకు దేవుడా? అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. పేదలను గొట్టి పెద్దలకు పెట్టే ప్రభుత్వం మోడీదని ఆయన ఆరోపించారు. పెట్రోలు డీజిల్ పై 30లక్షల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులేమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఈటల రాజేందరన్న నీకు నియ్యతుంటే… మోడీ 100 లక్షల కోట్లు అప్పు చేసింది నిజం కాదా? అని కేటీఆర్‌ అన్నారు. జాతీయ రహదారులంటున్న బండి సంజయ్… వాటిపై మళ్లీ టోల్ వసూలు చేస్తున్నారు? అని, ఎయిర్ పోర్టులకు పర్మిషన్ ఇవ్వడం తప్ప కేంద్రం చేసిందేమీ లేదని ఆయన అన్నారు. గిరిజనుల రిజర్వేషన్ల బిల్లు తొక్కిపెట్టారని, గిరిజన యూనివర్శిటీ ఇవ్వలేదని, ఎప్పుడూ లేనంతగా ధరలు, ద్రవ్యోల్బనం పెరిగిందని కేటీఆర్‌ దుయ్యబట్టారు. అమిత్ షాను టచ్ చేయాలని బండి సంజయ్ కు అనిపిస్తోందట. ఇదేం దిక్కుమాలిన కోరిక అంటూ సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్‌. మసీదులు కాదు తవ్వడం.. అభివృద్ధికోసం పునాదులు తవ్వుదాం రా అని బండి సంజయ్‌కు సవాల్‌ విసిరారు మంత్రి కేటీఆర్‌. చేతనైతే ఓ విద్యాసంస్థ తీసుకురా అని వ్యాఖ్యానించారు మంత్రి కేటీఆర్‌.

Also Read : Rangamarthanda: రాజశేఖర్ కూతురితో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి..?